ఆ విషయంలో మేము విఫలమయ్యాం.. అందుకే ఓడిపోయాం : రోహిత్ శర్మ

మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌట్ అవుతామని అస్సలు ఊహించలేదు. నేను గతంలో చెప్పినట్లే పిచ్ తేమగా ఉంటుందని అంచనా వేశాం. కానీ,

ఆ విషయంలో మేము విఫలమయ్యాం.. అందుకే ఓడిపోయాం : రోహిత్ శర్మ

Rohit Sharma

Updated On : October 20, 2024 / 2:36 PM IST

Rohit Sharma: న్యూజిలాండ్ తో తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. ఎనిమిది వికెట్ల తేడాతో కివీస్ జట్టు విజయం సాధించింది. కేవలం 107 పరుగుల టార్గెట్ ను కివీస్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా చేధించింది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడారు. రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్ అద్భుత బ్యాటింగ్ చేశారని అన్నారు. వారు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మేము ఎంతో ఉత్కంఠగా చూశాము. ముఖ్యంగా సర్ఫరాజ్ అద్భుతంగా పరిపక్వత ప్రదర్శించాడు. నాల్గో మ్యాచ్ లోనే ఇంత స్పష్టంగా ఆలోచించగలగడం విశేషమని రోహిత్ శర్మ అన్నారు.

Also Read: WTC 2025: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఇండియా డౌన్.. నాల్గో ప్లేస్‌కు దూసుకొచ్చిన న్యూజిలాండ్

మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌట్ అవుతామని అస్సలు ఊహించలేదు. నేను గతంలో చెప్పినట్లే పిచ్ తేమగా ఉంటుందని అంచనా వేశాం. కానీ, అలా జరగలేదు. దీనికితోడు న్యూజిలాండ్ బౌలర్లును సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో మేము విఫలమయ్యాం.. అందుకే ఇలాంటి ఫలితం వచ్చిందని రోహిత్ శర్మ అన్నారు. గతంలో కూడా ఇంగ్లాండ్ జట్టు చేతిలో ఓ మ్యాచ్ ఓడిపోయాం. ఆ తరువాత పుంజుకొని నాలుగు మ్యాచ్ లు గెలిచామని రోహిత్ గుర్తు చేశారు. కివీస్ తో రాబోయే రెండు టెస్టు మ్యాచ్ లలో మెరుగైన ప్రదర్శన ఇస్తామని రోహిత్ పేర్కొన్నారు.

Also Read: IND vs NZ: బెంగళూరు టెస్టులో భారత్ ఓటమి.. 36ఏళ్ల నిరీక్షణకు తెరదించిన న్యూజిలాండ్

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 24 నుంచి 30 వరకు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతుంది.
మూడో టెస్ట్ మ్యాచ్ నవంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు వాంఖడే స్టేడియంలో జరుగుతుంది.