WTC 2025: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఇండియా డౌన్.. నాల్గో ప్లేస్‌కు దూసుకొచ్చిన న్యూజిలాండ్
టీమిండియాపై విజయంతో న్యూజిలాండ్ జట్టు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో నాల్గో స్థానానికి దూసుకెళ్లింది. ఇండియాపై మ్యాచ్ గెలవకముందు ...

Team india
WTC Points Table : న్యూజిలాండ్ జట్టుతో మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (2023-25) పాయింట్ల పట్టికలో టీమిండియా ఆరు పాయింట్లు కోల్పోయింది. టెస్ట్ మ్యాచ్ కు ముందు వరకు టీమిండియా పాయింట్ల పట్టికలో 74శాతంతో అగ్రస్థానంలో ఉంది. కివీస్ పై ఓటమి తరువాత అగ్రస్థానంలో ఉన్నప్పటికీ 68.06శాతంకు పడిపోయింది.
Also Read: IND vs NZ: బెంగళూరు టెస్టులో భారత్ ఓటమి.. 36ఏళ్ల నిరీక్షణకు తెరదించిన న్యూజిలాండ్
టీమిండియాపై విజయంతో న్యూజిలాండ్ జట్టు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో నాల్గో స్థానానికి దూసుకెళ్లింది. ఇండియాపై మ్యాచ్ గెలవకముందు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న కివీస్ జట్టు.. ఇండియాపై విజయం తరువాత సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లను వెనక్కునెట్టి నాల్గో స్థానంలోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం 44.44 శాతంతో కొనసాగుతోంది. రెండో స్థానంలో ఆస్ట్రేలియా (62.50), మూడో స్థానంలో శ్రీలంక (55.56) ఉన్నాయి. న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా మరో రెండు టెస్టు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. రెండో టెస్టులోనూ కివీస్ జట్టుపై టీమిండియా ఓడిపోతే పాయింట్ల పట్టికలో రెండో స్థానంకు పడిపోతుంది. ఆస్ట్రేలియా అగ్రస్థానంలోకి దూసుకెళ్తుంది.
WTC Points Table…!!!
– India down from 74% to 68% after this loss. pic.twitter.com/cXNhUYevyq
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 20, 2024