KL Rahul : టెస్టులకు కేఎల్ రాహుల్ రిటైర్‌మెంట్? తొలి టెస్టు ఓటమి తరువాత రాహుల్ చేసిన పని దేనికి సంకేతం?
టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు కేఎల్ రాహుల్ టెస్టు కెరీర్ ముగిసిందా?

KL Rahul confirmed Test retirement Batters pitch touch gesture in Bengaluru breaks internet
KL Rahul Test retirement : టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు కేఎల్ రాహుల్ టెస్టు కెరీర్ ముగిసిందా? బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచే సుదీర్ఘ ఫార్మాట్‌లో రాహుల్‌కు ఆఖరిదా? అంటే అవుననే ఊహాగానాలే వినిపిస్తున్నాయి. బెంగళూరు టెస్టు మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం రాహుల్ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ రాహుల్ విఫలం అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 16 బంతులు ఆడి 12 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. కీలక సమయంలో విలియం ఓరూర్క్ బౌలింగ్‌లో రాహుల్ ఔట్ కావడం టీమ్ఇండియా వికెట్ల పతనానికి దారి తీసింది. ఫలితంగా కేవలం 107 పరుగుల లక్ష్యాన్నే కివీస్ ముందు ఉంచింది.
Shubman Gill : తొలి టెస్టులో భారత్ ఓటమి.. శుభ్‌మన్ గిల్ ఏం చేస్తున్నాడో చూశారా?
తన సొంత మైదానంలో కేఎల్ రాహుల్ ఖచ్చితంగా రాణించాలని లేకుండా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే అతడిని హెచ్చరించినట్లు పలు నివేదికలు వస్తున్నాయి. ఇక మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ బెంగళూరు పిచ్‌ను తాకి ఆశ్వీరాదం తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో టెస్టు క్రికెట్‌లో రాహుల్ కనిపించడం ఇదే చివరి సారి కావొచ్చునని కొందరు అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
చివరి ఐదు ఇన్నింగ్స్‌లో విఫలం అయ్యాడు. అతడు అడపాదడపా విజయాలు రాణించినా.. నిలకడగా రాణించలేకపోతున్నాడు. అదే సమయంలో సర్ఫరాజ్ ఖాన్ నిలకడగా పరుగులు చేయడం, శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో అతడికి జట్టులో చోటు దక్కడం కాస్త కష్టమే. ఈ క్రమంలో రాహుల్ మళ్లీ తన ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి జట్టు మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Kl Rahul last test match confirmed🥳pic.twitter.com/06q2SVpD3j
— Abhishek (@be_mewadi) October 20, 2024