IND vs NZ : న్యూజిలాండ్ విజయానికి రోహిత్ శర్మ సాయం.. ధన్యవాదాలు తెలిపిన కెప్టెన్ టామ్ లాథమ్.. కామెంట్స్ వైరల్
దాదాపు 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత గడ్డపై న్యూజిలాండ్ ఓ టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించింది.

Tom Latham thanks Rohit for helping NZ secure historic victory in Bengaluru Test
IND vs NZ 1st test : దాదాపు 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత గడ్డపై న్యూజిలాండ్ ఓ టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించింది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ మాట్లాడాడు. టాస్ ఓడిపోవడమే మంచిదైనదని ఆనందం వ్యక్తం చేశాడు. ఒకవేళ టాస్ గెలిస్తే తాము బ్యాటింగ్ ఎంచుకునే వాళ్లమని చెప్పాడు. రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం తమకు మంచి చేసిందన్నాడు.
ఇక ఖాళీ ప్రదేశాల్లో బంతిని పంపించి పరుగలు రాబట్టామని చెప్పాడు. తొలి రెండు ఇన్నింగ్స్‌కే మా గెలుపును ఖాయం చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక మూడో ఇన్నింగ్స్‌లో భారత్ కమ్‌బ్యాక్ ఇస్తుందని తాము ముందుగానే ఊహించామని, అయితే తమ బౌలర్లు రెండో కొత్త బంతితో టీమ్ఇండియా బ్యాటర్లను దెబ్బతిశారని అన్నాడు. స్వదేశంలో భారత్ ఎంత గొప్ప జట్టు అన్నది అందరికి తెలిసిందేనని చెప్పుకొచ్చాడు.
WTC 2025: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఇండియా డౌన్.. నాల్గో ప్లేస్‌కు దూసుకొచ్చిన న్యూజిలాండ్
రచిన్ రవీంద్ర, టీమ్ సౌథీ భాగస్వామ్యం తమ జట్టు విజయానికి బాటలు వేసిందన్నాడు. స్వల్ప లక్ష్యమే ఉండడంతో తాము స్వేచ్ఛగా ఆడినట్లు చెప్పాడు. ఇక రెండో టెస్టు మ్యాచ్‌లోనూ ఇలాంటి ప్రదర్శననే చేసి సిరీస్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నట్లు లాథమ్ తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలింది. కాగా.. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు బాదింది. దీంతో 356 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కివీస్‌కు లభించింది. అనంతరం భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసింది. కివీస్ ముందు 107 పరుగుల స్వల్ప లక్ష్యం నిలవగా.. 27.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ విజయాన్ని అందుకుంది.
ఆ విషయంలో మేము విఫలమయ్యాం.. అందుకే ఓడిపోయాం : రోహిత్ శర్మ
ఇక భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ అక్టోబర్ 24 నుంచి పూణే వేదికగా ప్రారంభం కానుంది.