IPL 2025: CSK బాల్ ట్యాంపరింగ్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికారంటూ వీడియో వైరల్..

చివరికి రుతురాజ్ గైక్వాడ్‌ ఆ వస్తువును తన జేబులో వేసుకున్నాడు.

Pic: ©BCCI

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ 2025లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్‌కింగ్స్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 155 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో చెన్నై 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఈ మ్యాచుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చెన్నై టీమ్‌లోని ఇద్దరు బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారని ఫ్యాన్స్ అంటున్నారు. అందుకే చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ మ్యాచులో గెలిచిందని ఆరోపిస్తున్నారు.

Also Read: టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదముద్ర.. ఎన్ని వేల కోట్ల రూపాయలంటే?

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచులో సీఎస్కే ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆ జట్టు సభ్యులు రుతురాజ్ గైక్వాడ్, ఖలీల్ అహ్మద్‌ బాల్‌ను పట్టుకుని, కెమెరా కంటికి కనపడకుండా ఏదో చేశారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఖలీల్, రుతురాజ్‌ ఏదో చిన్నపాటి వస్తువును పరస్పరం ఇచ్చుకున్నట్లు ఈ వీడియోలో కనపడుతోంది.

చివరికి రుతురాజ్ గైక్వాడ్‌ ఆ వస్తువును తన జేబులో వేసుకున్నాడు. దీంతో ఫ్యాన్స్‌ దీనిపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బాల్‌ ట్యాంపరింగ్ జరిగిందనడానికి ఇదే సాక్ష్యమని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

అయితే, వారిద్దరు చూయింగ్‌ గమ్‌ను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవచ్చని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఈ విషయంపై ఇప్పటివరకు అధికారికంగా ముంబై ఇండియన్స్ ఎలాంటి ఫిర్యాదూ చేయలేదు.