టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు.. హిందువులకే ఉద్యోగం.. వారికి జీతంలో జీఎస్టీ కటింగ్ లేకుండానే..
త్వరలో వీఐపీ బ్రేక్ దర్శన సమయ మార్పు చేస్తామని చెప్పారు.

TTD
తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్‌కు ఇవాళ ఆమోదముద్ర పడింది. బడ్జెట్ రూ.5,258.68 కోట్లుగా నిర్ణయించారు. తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. అలాగే, ఒంటిమిట్ట కోదండరామ బ్రహ్మోత్సవాల పోస్టర్లను విడుదల చేశారు.
“సీఎం చంద్రబాబు నాయుడు 21 తేదీన కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేశాం. 50 ఎకరాలు టీటీడీ స్వాధీనం చేసుకుంటుంది. ఇతర దేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నాం.
Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ కుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. వాదనలు ఇలా జరిగాయి..
శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కమిటీ వేస్తున్నాం. శ్రీవారి భూముల కేసులు న్యాయస్థానాల్లో వాటిని త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటాం. టీటీడీ ఉద్యోగులు హిందువు అయి ఉండాలి. అన్ని రాష్ట్రాల రాజధానిలో ఆలయాల నిర్మాణం చేస్తాం. ఒకటిన్నర ఏడాది కొన్ని ఆలయాలు నిర్మాణం చేయాలని బోర్డు సంకల్పంతో ఉంది.
అమరావతిలో శ్రీనివాస కల్యాణం గొప్పగా నిర్వహించారు. శ్రీనివాస కల్యాణం ఘనంగా నిర్వహించారని సీఎం చెప్పారు. పోటు కార్మికులకు ఇచ్చే 43 వేలు జీతంలో జీఎస్టీ కట్ చేస్తున్నారు. ఐదు వేలు రూపాయలు జీఎస్టీ పెట్టుకోకుండా నిర్ణయం తీసుకున్నాం. సైన్స్ సిటీకి 20 ఎకరాలు కేటాయించాం. సైన్స్ సిట్ ఎలాంటి నిర్మాణాలు చేయకపోవడంతో వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాం.
తిరుమలలో అనధికార హకర్లపై చర్యలు తీసుకుంటాం. త్వరలో వీఐపీ బ్రేక్ దర్శన సమయ మార్పు చేస్తాం. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ప్రయోగాత్మకంగా ట్రయల్ నిర్వహణ ఉంటుంది” అని బీఆర్ నాయుడు చెప్పారు.
మరిన్ని నిర్ణయాలు
- గడిచిన బడ్జెట్ కంటే స్వల్పంగా 78.83 కోట్లు పెరిగిన బడ్జెట్
- అనవసరమైన కేటాయింపులు తగ్గించి… భక్తులకు మేలు చేసి, హిందూ ధర్మ వ్యాప్తి చెందేలా బడ్జెట్ రూపకల్పన
రాబడి అంచనాలు
- హుండీ కానుకల ద్వారా అత్యధికంగా రూ.1729 కోట్లు
- బ్యాంకుల్లో డిపాజిట్లు పై వడ్డీ రూపంలో రూ.1,310 కోట్లు
- ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.600 కోట్లు
- దర్శన టిక్కెట్లు విక్రయాల ద్వారా రూ.310 కోట్లు
- ఆర్జితసేవ టిక్కెట్లు విక్రయాల ద్వారా రూ.130 కోట్లు
- గదులు, కళ్యాణమండపాలు అద్దె రూపంలో రూ.157 కోట్లు
- తలనీలాలు విక్రయాల ద్వారా రూ.176.5 కోట్లు
బడ్జెట్ కేటాయింపులు
- ఉద్యోగులు జీతభత్యాలకు రూ.1773.75 కోట్లు
- ముడి సరుకులు కొనుగోలుకు రూ.768.5 కోట్లు
- కార్పోస్ & బ్యాంక్ డిపాజిట్లకు రూ.800 కోట్లు
- ఇంజనీరింగ్ పనులకు రూ.350 కోట్లు
- గరుడవారధి పనులకు రూ.28 కోట్లు
- స్విమ్స్ ఆసుపత్రికి రూ.120 కోట్లు
- ఫెసిలిటీ మ్యానేజ్మెంట్ సర్వీస్ కు రూ.80 కోట్లు
- ఇతర సంస్థల గ్రాంట్ లకు రూ.130 కోట్లు
- హిందూ ధర్మప్రచార పరిషత్ ప్రాజెక్టు & అనుబంధ ప్రాజెక్ట్ లకు రూ.121.5 కోట్లు
- రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం కింద రూ.50 కోట్లు
- టీటీడీ విద్యాసంస్థలు, ఇతర వర్సిటీల గ్రాంట్ లకు రూ.189 కోట్లు
- ఆరోగ్యం, పారిశుధ్యానికి రూ.203 కోట్లు
- నిఘా, భద్రతా విభాగానికి రూ.191 కోట్లు
- టీటీడీ వైద్యశాలలకు రూ.41 కోట్లు.
- స్విమ్స్ గ్రాంట్స్ కు రూ.60 కోట్లు
- బర్డ్, ప్రాణదాన ట్రస్ట్ కు రూ.55 కోట్లు