BAN vs PAK : కీలక మ్యాచ్‌లో టాస్ ఓడిన పాకిస్థాన్.. తుది జట్టులో భారీ మార్పు..
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఢాకా వేదికగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు రెండో వన్డే మ్యాచ్‌లో (BAN vs PAK) తలపడుతున్నాయి
- Thota Vamshi Kumar
- Published On : March 13, 2026 / 02:15 PM IST
BAN vs PAK 2nd ODI Bangladesh opt to bowl one change in Pakistan
- ఢాకా వేదికగా బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్ల మధ్య రెండో వన్డే
- టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
- పాకిస్థాన్ బ్యాటింగ్
BAN vs PAK : మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఢాకా వేదికగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు రెండో వన్డే మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన పాక్ జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని భావిస్తోంది.
‘మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇది అద్భుతమైన మ్యాచ్. గత మ్యాచ్‌లో రాణా చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఈ రోజు మొదటి 10 ఓవర్లలో సాధ్యమైనన్ని ఎక్కువ వికెట్లు తీసేందుకు ప్రయత్నిస్తాము. అయితే.. ఇది అంత సులువైనది కాదు. సవాల్‌తో కూడుకున్నది. బ్యాటింగ్, బౌలింగ్ పై మేము దృష్టి పెట్టాలి. బ్యాటర్లు మరింత బాధ్యతను తీసుకోవాలి. తమీమ్ గత మ్యాచ్‌లో బాగా ఆడాడు. తుది జట్టులో మార్పులు లేవు.’ అని బంగ్లాదేశ్ కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ అన్నాడు.
‘ఇది మంచి వికెట్‌లాగా కనిపిస్తుంది. కొంచెం గడ్డి కూడా ఉంది. గత మ్యాచ్ లో బ్యాటర్లు రాణించలేదు. వారు తప్పులను తెలుసుకుని ఈ మ్యాచ్‌లో రాణిస్తారని ఆశిస్తున్నాను. వారిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎవరైన ఒక బ్యాటర్లు ఆఖరి వరకు క్రీజులో ఉంటే బాగుంటుంది. భారీ స్కోరు చేసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెడతామని ఆశిస్తున్నాను. తుది జట్టులో ఓ మార్పు ఉంది. అబ్రార్ అహ్మద్‌కు విశ్రాంతి ఇచ్చాము. అతడి స్థానంలో హరిస్ రౌఫ్ తుది జట్టులోకి వచ్చాడు.’ అని పాకిస్థాన్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది అన్నాడు.
Bangladesh won the toss and chose to bowl first.
Bangladesh 🆚 Pakistan | 2nd ODI | Dutch-Bangla Bank ODI Series 2026! 🏏🔥
13 March 2026 | 2:15 PM (BST)
SBNCS, Dhaka#BCB #Cricket #Bangladesh #Pakistan #ODI pic.twitter.com/M2EAnPtQbA
— Bangladesh Cricket (@BCBtigers) March 13, 2026
బంగ్లాదేశ్ తుది జట్టు..
సైఫ్ హసన్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిట్టన్ దాస్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్(కెప్టెన్), తౌహిద్ హృదయ్, అఫీఫ్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, రిషాద్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, నహిద్ రాణా
పాకిస్థాన్ తుది జట్టు..
సాహిబ్జాదా ఫర్హాన్, మాజ్ సదాకత్, షామిల్ హుస్సేన్, మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సల్మాన్ అఘా, హుస్సేన్ తలత్, అబ్దుల్ సమద్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది(కెప్టెన్), మహ్మద్ వసీం జూనియర్, హరీస్ రవూఫ్.
