RCB vs CSK, IPL 2020: బెంగళూరు స్కోరు 145/6, చెన్నై టార్గెట్ 146

  • Publish Date - October 25, 2020 / 05:28 PM IST

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన 44వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అధ్భుతంగా బౌలింగ్ చేసింది. చెన్నై బౌలర్లు అద్భుత ప్రదర్శనతో బెంగళూరు బ్యాట్స్‌మెన్‌లను భారీ స్కోరు చెయ్యకుండా కట్టడి చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం ఆరు వికెట్లు నష్టపోయి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రమే మైదానంలో పరుగులు రాబట్టాడు. డివిలియర్స్ కాసేపు రాణించినా భారీ స్కోరు చెయ్యడంలో మాత్రం విఫలం అయ్యాడు.



తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు ఆరంభంలో అదరగొట్టింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ కొహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. 43 బంతుల్లో 50పరుగులు చెయ్యగా.. డివిలియర్స్ 39, దేవదత్ పడిక్కల్ 22, ఆరోన్ ఫించ్ 15 పరుగులు చేశారు. 42పరుగులకే రెండు వికెట్లు కోల్పోగా.. బెంగళూరు స్కోర్ నడిపించే బాధ్యతను కెప్టెన్ కొహ్లీ, డివిలియర్స్ తీసుకున్నాడు. ఆచితూచి ఆడుతూ విలువైన భాగస్వామ్యం నెలకొల్పగా.. భారీ స్కోరు చేస్తున్నట్లుగా అనిపించింది.



అయితే 18వ ఓవర్లలో డివిలియర్స్.. ఆ తర్వాత మోయిన్ అలీ, కొహ్లీ, మోరిస్ వరుసగా అవుట్ అవడంతో బెంగళూరు స్కోర్ 150 పరుగుల మార్క్ కూడా చేరుకోలేదు. చెన్నై బౌలర్లలో సామ్ కరన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్ రెండు, మిచెల్ సాంత్‌నర్ ఒక వికెట్ తీసుకున్నాడు.. కొత్త బౌలర్ మోను కుమార్ రెండు ఓవర్లలో 20పరుగులు చేశాడు.



అక్టోబరు 10న ఇదే దుబయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లో చెన్నైపై బెంగళూరు ఘన విజయం సాధించింది. 37 పరుగుల తేడాతో కొహ్లీసేన గెలుపొందింది. ఈ మ్యాచ్లో గెలిచి బెంగళూరుపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది చెన్నై సూపర్ కింగ్స్. ఈ క్రమంలో చెన్నై టార్గెట్ 146పరుగులుగా ఫిక్స్ అయ్యింది.