BAN vs NED Match : నెదర్లాండ్స్ పై బంగ్లాదేశ్ ఓటమి.. బూటుతో కొట్టుకున్న అభిమాని.. ఆ తరువాత ఏమన్నాడంటే? వీడియో వైరల్

వీడియోలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు అభిమాని బంగ్లా ప్లేయర్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇతర అభిమానులు అతనితో ఏకీభవించడం వీడియోలో కనిపించింది.

Bangladesh Defeat

ODI World Cup 2023 BAN vs NED : భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ సంచ‌ల‌నాల‌కు వేదికగా మారింది. ఈ మెగా టోర్నీలో నెద‌ర్లాండ్స్ మ‌రో జ‌ట్టుకు షాకిచ్చింది. మొన్న సౌతాఫ్రికాను ఓడించిన నెద‌ర్లాండ్స్ తాజాగా బంగ్లాదేశ్‌ జట్టుకు బిగ్ షాకిచ్చింది. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా బంగ్లాదేశ్ తో జ‌రిగిన మ్యాచ్‌లో 87 ప‌రుగుల తేడాతో నెదర్లాండ్స్ జట్టు విజ‌యం సాధించింది. 230 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన బంగ్లాదేశ్ 42.2వ ఓవ‌ర్లలో 142 ప‌రుగులకు ఆలౌటైంది.

Also Read : NED vs BAN : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో నెద‌ర్లాండ్స్ మ‌రో సంచ‌లనం.. బంగ్లాదేశ్ పై ఘ‌న విజ‌యం

నెదర్లాండ్స్ జట్టుపై ఓటమితో బంగ్లాదేశ్ సెమీఫైనల్ రేసుకు దూరమైంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు బంగ్లాదేశ్ మొత్తం ఆరు  మ్యాచ్ లు ఆడగా.. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఐదు మ్యాచ్ లలో ఓడిపోయింది. దీంతో ఆ జట్టు సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. బంగ్లాదేశ్ తాజా ఓటమితో జట్టు మద్దతుదారులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లా ప్లేయర్స్ ఆటతీరుపై విమర్శలు చేస్తున్నారు. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో బంగ్లా జట్టు ఓటమి తరువాత ఆ జట్టు అభిమాని ఒకరు బూటుతో తనను తానుకొట్టుకుంటూ బంగ్లా ప్లేయర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Bangladesh Defeat

Also Read : AUS vs NZ : ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా విజ‌యం.. వ‌రుస‌గా నాలుగో మ్యాచ్‌లో గెలుపు

వీడియోలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు అభిమాని బంగ్లా ప్లేయర్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇతర అభిమానులు అతనితో ఏకీభవించడం వీడియోలో కనిపించింది. పెద్ద జట్టుతో ఓడిపోయినందుకు మేము చింతించేవాళ్లం కాదు. కానీ, మీరు నెదర్లాండ్స్ తో ఎలా ఓడిపోతారు? షకీబ్, ముస్తాఫిజుర్ అందరూ షూష్ ధరించాలి. వాళ్ల పేరుమీద నేనే తన్నుకుంటున్నాను అంటూ షూతో చెంపలపై కొట్టుకోవటం వీడియోలో కనిపించింది. అయితే, ఈ వీడియోను పోస్టు చేసిన సామిక్ సాహెబ్ అనే వ్యక్తి.. బంగ్లాదేశ్ అబిమానులు తమ జట్టును ఉత్సహపరిచేందుకు పెద్ద సంఖ్యలో ఈడెన్ గార్డెన్ కు వచ్చారు. స్టేడియం చుట్టూ హోటళ్లు కూడా అందుబాటులో లేవు. ఇన్ని కష్టాలు ఎదుర్కొన్న అభిమానులు ఇప్పుడు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇది చాలా నిరాశపర్చింది అంటూ రాశాడు.