Mashrafe Mortaza : మంట‌ల్లో కాలిపోతున్న బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మోర్తజా ఇళ్లు.. అస‌లేం జ‌రిగిందంటే..?

అవామీ లీగ్ పార్టీకి చెందిన ఎంపీ అయిన మోర్త‌జా ప‌ట్ల నిర‌స‌న కారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Bangladesh unrest Mashrafe Mortaza house set to fire

Mashrafe Mortaza house : గ‌త‌కొన్నాళ్లుగా బంగ్లాదేశ్‌ రిజ‌ర్వేష‌న్ల అంశంపై గొడ‌వ‌ల‌తో అట్టుడుకుతోంది. ప‌లు చోట్ల హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మష్రఫే మోర్తజాకు చేదు అనుభ‌వం ఎదురైంది. న‌రైల్‌లోని అత‌డి ఇంటికి నిర‌స‌న‌కారులు నిప్పుపెట్టారు. రిజ‌ర్వేష‌న్ల అంశం, విద్యార్థుల సామూహిక‌ల అరెస్టుల ప‌ట్ల మౌనంగా ఉన్నందుకు అధికార అవామీ లీగ్ పార్టీకి చెందిన ఎంపీ అయిన మోర్త‌జా ప‌ట్ల నిర‌స‌న కారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ క్ర‌మంలోనే అత‌డిని ఇంటిని చుట్టు ముట్టి అక్క‌డ విధ్వంసం సృష్టించి త‌గ‌ల బెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. నిర‌స‌న‌లు మ‌రింత ఉధృతం కావ‌డంతో ప్ర‌ధాని ప‌ద‌వికి షేక్ హ‌సీనా సోమ‌వారం రాజీనామా చేశారు. అనంత‌రం ఆమె త‌న సోద‌రితో క‌లిసి భార‌త్‌కు చేరుకున్నారు. ఆమె రాజీనామా విష‌యాన్ని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వెల్ల‌డించారు. త్వ‌ర‌లోనే కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి సైన్యం స‌హ‌క‌రిస్తుంద‌ని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికైనా ఆందోళ‌న‌కారులు త‌మ నిర‌స‌న‌లను విర‌మించాల‌ని కోరారు.

Rohit sharma : రోహిత్ శ‌ర్మ‌ను ఊరిస్తున్న రికార్డు.. మూడో వ‌న్డేలో అందుకుంటాడా..?

బంగ్లాదేశ్ త‌రుపున మోర్తజా 6 టెస్టులు, 220 వ‌న్డేలు, 54 టీ20ల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. మూడు ఫార్మాట్ల‌లో క‌లిపి 389 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ‌ర్ ష‌కీబ్ అల్ హ‌స‌న్ త‌రువాత బంగ్లా త‌రుపున అత్య‌ధిక వికెట్లు తీసిన రెండో బౌల‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. మూడు ఫార్మాట్ల‌లో క‌లిపి 2955 ప‌రుగులు సాధించాడు.

117 మ్యాచుల్లో బంగ్లాకు నాయ‌క‌త్వం వ‌హించాడు. ఆట‌కు వీడ్కోలు చెప్పిన త‌రువాత 2018లో అత‌డు రాజ‌కీయాల్లో అడుగుపెట్టాడు. హ‌సీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌లో చేరాడు. 2019లో నరేల్‌-2 డిస్ట్రిక్ట్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఎంపీ గెలుపొందాడు. 2024 ఎన్నికల్లోనూ మరోసారి పదవిని కైవసం చేసుకున్నాడు.

Stunning Catch : క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఇలాంటి క్యాచ్‌ను ఎప్పుడూ చూసి ఉండ‌రు.. దీన్ని ఏమ‌ని పిలవాలో కాస్త చెప్ప‌రూ..?

ట్రెండింగ్ వార్తలు