Rohit sharma : రోహిత్ శ‌ర్మ‌ను ఊరిస్తున్న రికార్డు.. మూడో వ‌న్డేలో అందుకుంటాడా..?

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.

Rohit sharma : రోహిత్ శ‌ర్మ‌ను ఊరిస్తున్న రికార్డు.. మూడో వ‌న్డేలో అందుకుంటాడా..?

Team India Captain Rohit sharma eye on Chris Gayle record

Rohit sharma-Chris Gayle : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. కొలంబో వేదిక‌గా బుధ‌వారం శ్రీలంక‌తో జ‌ర‌గ‌నున్న మూడో వ‌న్డే మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ దీన్ని అందుకునే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో రోహిత్ రెండు సిక్స‌ర్లు బాదితే ఈ రికార్డు అత‌డి సొంతం అవుతుంది. వ‌న్డేల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన రెండో ఆట‌గాడిగా రోహిత్ నిలుస్తాడు. ఈ క్ర‌మంలో అత‌డు వెస్టిండీస్ దిగ్గ‌జ ఆట‌గాడు క్రిస్‌గేల్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టేస్తాడు.

గేల్ ఇప్ప‌టి వ‌ర‌కు 294 ఇన్నింగ్స్‌ల్లో 331 సిక్స‌ర్లు కొట్టాడు. ఇక రోహిత్ శ‌ర్మ విష‌యానికి వ‌స్తే.. 256 ఇన్నింగ్స్‌ల్లో 330 సిక్స‌ర్లు బాదాడు. ఇక వ‌న్డేల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు ఆట‌గాడిగా పాకిస్తాన్‌కు చెందిన షాహిద్ అఫ్రీది కొన‌సాగుతున్నాడు. అత‌డు 369 ఇన్నింగ్స్‌ల్లో 351 సిక్స‌ర్లు కొట్టాడు.

అయ్యో.. వినోద్ కాంబ్లీకి ఏమైంది..? షాకింగ్ వీడియో వైరల్.. నడవలేని స్థితిలో మాజీ క్రికెటర్

వ‌న్డేల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ప్లేయ‌ర్లు..

* షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్‌) – 369 ఇన్నింగ్స్‌లో 351
* క్రిస్‌గేల్ (వెస్టిండీస్‌) – 294 ఇన్నింగ్స్‌ల్లో 331
* రోహిత్ శ‌ర్మ (భార‌త్‌) – 256 ఇన్నింగ్స్‌ల్లో 330
* స‌న‌త్ జ‌య‌సూర్య (శ్రీలంక) – 433 ఇన్నింగ్స్‌ల్లో 270
* మ‌హేంద్ర సింగ్ ధోని (భార‌త్‌) – 297 ఇన్నింగ్స్‌ల్లో 229

ఇదిలా ఉంటే.. వ‌న్డేల్లో ల‌క్ష్య ఛేద‌న‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాడిగా రోహిత్ శ‌ర్మ నిలిచాడు. శ్రీలంక‌తో జ‌రిగిన రెండో వ‌న్డేలో అత‌డు ఈ రికార్డును అందుకున్నాడు. రెండో వ‌న్డేల్లో రోహిత్ 44 బంతులు ఎదుర్కొని 64 ప‌రుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 4 సిక్స‌ర్లు ఉన్నాయి. ఈ సిక్స‌ర్ల‌తో క‌లిపి రోహిత్ ఛేద‌న‌లో 179 సిక్స‌ర్లు బాదాడు. గేల్ 177 సిక్స‌ర్ల‌తో రెండో స్థానానికి ప‌డిపోయాడు.

Stunning Catch : క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఇలాంటి క్యాచ్‌ను ఎప్పుడూ చూసి ఉండ‌రు.. దీన్ని ఏమ‌ని పిలవాలో కాస్త చెప్ప‌రూ..?

ల‌క్ష్య ఛేద‌న‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన ఆట‌గాళ్లు..

* రోహిత్ శ‌ర్మ (భార‌త్) – 179
* క్రిస్‌గేల్ (వెస్టిండీస్‌) – 177
* షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్‌) – 166
* స‌న‌త్ జ‌య‌సూర్య (శ్రీలంక) – 109
* మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్‌) – 103

ఇక వ‌న్డే సిరీస్ విష‌యానికి వ‌స్తే.. మూడు మ్యాచుల సిరీస్‌లో భార‌త్ 0-1తో వెనుక‌బ‌డి ఉంది. బుధ‌వారం జ‌ర‌గ‌నున్న మూడో వ‌న్డేలో గెలుపొంది సిరీస్‌ను స‌మం చేయాల‌ని భార‌త్ భావిస్తోండ‌గా, ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాల‌ని లంక ఆరాట‌ప‌డుతోంది.