BBL: క్రికెటర్లను వదలని కరోనా.. మెల్ బోర్న్ స్టార్‌ కెప్టెన్‌కు పాజిటివ్..!

బిగ్‌బాష్‌ లీగ్‌ జట్టు మెల్‌బోర్న్‌ స్టార్స్‌ను కరోనా మహమ్మారి వెంటాడుతోంది. వరుసగా క్రికెటర్లు ఒకరితరువాత మరొకరు కరోనా బారిన పడుతున్నారు.

Bbl 2021 22 Melbourne Stars Captain Glenn Maxwell Tests Covid 19 Positive (1)

BBL 2021 22: బిగ్‌బాష్‌ లీగ్‌ జట్టు మెల్‌బోర్న్‌ స్టార్స్‌ను కరోనా మహమ్మారి వెంటాడుతోంది. వరుసగా క్రికెటర్లు ఒకరితరువాత మరొకరు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మెల్ బోర్న్ స్టార్ క్రికెటర్ కెప్టెన్ గ్లెన్ మాక్స్ వెల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తోటి ఆటగాళ్లు వరుసగా కరోనా సోకడంతో తాను కూడా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు చేయించుకున్నాడు. ఆ టెస్టులో కరోనా పాజిటివ్ వచ్చింది.

కరోనా అని కచ్చితంగా నిర్ధారణ కోసం పీసీఆర్ టెస్టు చేయించుకున్నాడు. పీసీఆర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే 12 మంది క్రికెటర్లకు, మరో 8 మంది టీం స్టాఫ్ కు కరోనా సోకింది. ఇప్పుడు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ కు కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటికే జట్టులలోని స్టార్ ఆటగాళ్లలో ఆడం జంపా, నాథన్ కౌల్టర్ నైల్, మార్కస్ స్టోయినిస్ వరుసగా కరోనా బారినపడ్డారు.


వీరంతా మొన్నటివరకూ ఐసోలేషన్ ఉన్నారు. ఇటీవలే ఐసోలేషన్ పూర్తి అయింది. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా అందరికి కరోనా నెగటివ్ వచ్చింది. తదుపరి మ్యాచ్ ల్లో ఆడేందుకు వీరంతా రెడీ అవుతున్నారు. త్వరలో అడిలైడ్ స్టెకర్స్‌తో జరుగబోయే మ్యాచ్‌లకు కరోనా నుంచి కోలుకున్న ఆటగాళ్లంతా అందుబాటులోకి రానున్నారు.

Read Also : RGV : ట్విట్టర్లో కొనసాగుతున్న చర్చ.. పేర్ని నానికి ఆర్జీవీ రిప్లై