RGV : ట్విట్టర్లో కొనసాగుతున్న చర్చ.. పేర్ని నానికి ఆర్జీవీ రిప్లై

అయితే ఇవాళ ఉదయం ఆర్జీవీ అడిగిన ప్రశ్నలకి ఏపీ సినిమాటోగ్రాఫర్ మంత్రి సమాధానాలు ఇచ్చారు. తాజాగా ఆర్జీవీ పేర్ని నాని ఇచ్చిన సమాధానాలకి మళ్ళీ ప్రశ్నలు..............

RGV : ట్విట్టర్లో కొనసాగుతున్న చర్చ.. పేర్ని నానికి ఆర్జీవీ రిప్లై

Rgv Perni Nani (1)

RGV :  గత కొద్ది రోజులుగా చిత్రపరిశ్రమలో ఏపీ సినిమా టికెట్ల ధరలు, ఏపీ థియేటర్ల మూసివేత హాట్ టాపిక్ గా మారింది. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు వరుసగా కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల ఈ విషయంపై సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ కూడా కామెంట్ చేశాడు. అంతే కాక వరుస పెట్టి ప్రెస్ మీట్స్ లో, ఇంటర్వ్యూలలో ఏపీ ప్రభుత్వాన్ని సినిమా టికెట్ల విషయంలో ప్రశ్నిస్తున్నాడు. నిన్న ట్విట్టర్ లో ఏపీ మంత్రి పేర్ని నానికి సినిమా టికెట్ల ధరల విషయంలో వరుస ప్రశ్నలు సంధించి సమాధానాలు ఇమ్మని అడిగాడు.

అయితే ఇవాళ ఉదయం ఆర్జీవీ అడిగిన ప్రశ్నలలో కొన్నిటికి తప్ప చాలా వాటికి ఏపీ సినిమాటోగ్రాఫర్ మంత్రి సమాధానాలు ఇచ్చారు. తాజాగా ఆర్జీవీ పేర్ని నాని ఇచ్చిన సమాధానాలకి మళ్ళీ ప్రశ్నలు సంధిస్తూ ట్వీట్స్ చేశారు. అయితే ముందు ఆర్జీవి ఇంగ్లీష్ లో ట్వీట్స్ వేయగా పేర్ని నాని తెలుగులో రిప్లై ఇచ్చారు. ఇప్పుడు ఆర్జీవీ కూడా తెలుగులో రిప్లై ఇవ్వడం విశేషం.

RGV : పేర్ని నానిపై ప్రశ్నల వర్షం కురిపించిన ఆర్జీవీ

పేర్ని నాని సమాధానాలకి ఆర్జీవీ ట్వీట్స్..

థ్యాంక్యూ నాని గారు.. చాలా మంది లీడర్లలా పరుష పదజాలంతో మాట్లాడకుండా డిగ్నిటీతో సమాధానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండీ. ఇక విషయానికి వస్తే వంద రూపాయల టికెట్ ని వెయ్యికి అమ్ముకోవచ్చా? అన్నది క్వశ్చన్ కాదండీ. అది అమ్మేవాడి నమ్మకం, కొనేవాడి అవసరం బట్టి ఉంటుంది.

నీళ్ళు లేని పరిస్థితి ఉన్నప్పుడు గ్లాస్ నీళ్ళు 5 లక్షలకి కొనచ్చు. అది పరిస్థితిని ఎక్స్ప్లాయిట్ అనుకుంటే మార్కెట్ ఉన్నదే దానికి. కార్ కావాలనే కోరికని ఎక్స్ప్లాయిట్ చెయ్యడానికే లగ్జరీ కార్లు చేసి ఆకర్షిస్తారు. తప్పని అడ్డు కట్ట వేస్తే మనం ఇప్పటికీ కాలి నడకన తిరుగుతూ ఉండేవాళ్ళం.

ముడి పదార్థం 500 కూడా ఖర్చవ్వని పెయింటింగ్ ని కొనేవాడుంటే 5 కోట్లకి అమ్ముతారు. ముడి పదార్థానికి మాత్రమే వాల్యూ ఇస్తే బ్రాండ్ కి, ఐడియాకి ఎలా వెల కడతారు?

క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కంటిన్యువస్ గా అన్ని ఇంకా బెటర్ గా ఉండేలా ప్రయత్నించడం. బెటరా కాదా అనేది కొనుగోలుదారుడు నిర్ణయిస్తాడు.

కొనేవాడికి అమ్మేవాడికి మధ్య ట్రాన్సాక్షన్ ఎంతకి జరిగిందనే ట్రాన్స్పరెన్సీ మాత్రమే ప్రభుత్వాలకి అవసరం. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన టాక్స్ కోసం.

బ్లాక్ మార్కెటింగ్ అనేది గవర్నమెంట్ కి తెలియకుండా చేసే క్రైమ్. ఓపెన్ గా ఎంతకి అమ్ముతున్నాడో చెప్పి అమ్మితే అది తప్పెలా అవుతుంది? ఉదాహరణకి మీకు తెలుసో తెలియదో బాంబే, ఢిల్లీలలో వీక్ డే బట్టి, థియేటర్ బట్టి, ఏ సినిమా అనేదాన్ని బట్టి టికెట్ ప్రైజ్ లు 75 రూపాయల నుండి 2200 రూపాయల వరకూ వేరీ అవుతాయి. వీటన్నింటినీ నియంత్రించేది కేవలం ఓల్డెస్ట్ ఎకనామిక్ థియరీ డిమాండ్ అండ్ సప్లై.

గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది కొన్ని విపరీత పరిస్థితుల్లో బియ్యం, గోధుమ లాంటివి ఉత్పత్తి ఎక్కువయిపోయి ధర పడిపోయినప్పుడు, ఉత్పత్తి తక్కువయిపోయి ధర విపరీతంగా పెరిగిపోయినప్పుడు కానీ ఉంటుంది. అలాంటి విపరీత పరిస్థితి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ప్రేక్షకులలో కానీ ఎక్కడ వచ్చిందండీ?

సారీ నాని గారు లూటీ అనే పదం ఉపయోగించేది బలాన్ని ఉపయోగించి క్రిమినల్ గా లాక్కున్నప్పుడు. అమ్మేవాడు కొనేవాడు పరస్పరం అంగీకరించుకుని చేసుకునే దాన్ని ట్రాన్సాక్షన్ అంటారు. ఆ ట్రాన్సాక్షన్ లీగల్ గా జరిగినప్పుడు గవర్నమెంట్ వాటా టాక్స్ రూపంగా తానంతట తనే వస్తుంది.

థియేటర్లనేవి ప్రజా కోణంలో వినోద సేవలందించే ప్రాంగణాలు అని చెప్పారు. అలా అని ఏ ప్రజలు చెప్పారో వాళ్ల పేర్లు చెప్పగలరా? లేకపోతే రాజ్యాంగంలో కానీ సినిమాటోగ్రఫీ యాక్ట్ లో ఈ డెఫినిషన్ ఉందా. మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని సమర్థించుకోవటానికి, ఆ డెఫినిషన్ మీకు మీరు ఇచ్చుకుంటున్నారు.

థియేటర్లనేవి జూన్ 19 1905న నికెలోడియోన్ అనే ప్రపంచం లోనే మొట్ట మొదటి థియేటర్ అమెరికాలో పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకూ అవి కేవలం బిజినెస్ కోసం పెట్టిన వ్యాపార సంస్థలు. అంతే కానీ ప్రజా సేవ నిమిత్తం ఎప్పుడూ ఎవ్వరూ పెట్టలేదు. కావాలంటే మీ గవర్నమెంట్ లో ఉన్న థియేటర్ ఓనర్లని అడగండి.

సొసైటీ ఆధునీకతకి ముఖ్య కారణం మోటివేషన్. ఎందుకంటే ప్రతి మనిషి కూడా మానవ సహజంగా ఉన్న పొజిషన్ కన్నా ఎదగాలని కోరుకుంటాడు. పేదవాడు ధనికుడవ్వాలని కోరుకుంటాడు, సైంటిస్ట్ ఎవ్వరూ కనిపెట్టలేనిది కనిపెట్టాలనుకుంటాడు .మీ పార్టీ కార్యకర్త మీలా మంత్రి అవ్వాలని కోరుకుంటాడు. అలా కోరుకునేది అందరి కన్నా బెటర్ అవ్వాలనే ఒక మోటివేషన్ తో. ఆ బెటర్ గా ఉన్నప్పుడు వచ్చే అదనపు సౌఖ్యాలని కట్ చేసినప్పుడు మనిషికి మోటివేషన్ పోతుంది. కమ్యూనిజం ఘోరంగా ఫెయిల్ అయ్యింది అక్కడే.

రేట్ లు తగ్గిస్తున్నది పేదవాడికి అందుబాటులో ఉండాలని ఎందుకంటే సినిమాని నిత్యావసర వస్తువుగా పరిగణిస్తున్నాము అని చెప్పింది మీ నాయకులే. అది కానప్పుడు అసలు ఈ డిస్కషన్ ఎందుకు ఇష్యూ లేనప్పుడు?

మీరు సౌకర్యాలని బట్టి టికెట్ రేట్లని నిర్ణయిస్తారు అన్నారు. అది 100% కరెక్ట్. అలాంటప్పుడు V EPIC థియేటర్ లో ఉన్న సౌకర్యాలను చూడకుండా ఆ థియేటర్ ఉన్న ఏరియా బట్టి టికెట్ ప్రైజ్ ఎలా పెట్టారు? ఈ కింది ట్వీట్ లో మీరు చెప్పింది మీకు అర్థమైతే ఇంక సమస్య లేనట్టే. వివిధ హోటల్సు లో ఆ ఆ హోటల్ వాళ్ళు, వాళ్ళిచ్చే సౌకర్యాలను బట్టే ప్రైజ్ లిస్ట్ పెట్టుకుంటారు

నేనడిగే ముఖ్య ప్రశ్న టికెట్ ధర నిర్ణయించటానికి ప్రభుత్వం ఎవరని? పవన్ కళ్యాణ్ సినిమాకి సంపూర్ణేష్ బాబు సినిమాకి మీ ప్రభుత్వంలో తేడా లేనప్పుడు మంత్రిగా మీకు మీ డ్రైవర్ కి కూడా తేడా లేదా?

పేదల కోసం చెయ్యడం అనే మీ ఉద్దేశం మంచిది కావచ్చు. కానీ దానికోసం పేదల్ని ధనికుల్ని చెయ్యటానికి మీ ప్రభుత్వం పని చెయ్యాలి కానీ ఉన్న దనికుల్ని పేదల్ని చెయ్యకూడదు. అలా చేస్తే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో కల్లా పేద రాష్ట్రం అయ్యే ప్రమాదముంది.

చివరిగా పేర్ని నాని గారు మీ పార్టీ లో కొందరు మిగతా లీడర్ల లాగా అడ్డంగా తిట్లతోనో పర్సనల్ విషయాల మీద దూకడం కాకుండా డిగ్నిటీతో సామరస్యం పాటించినందుకు ఇంకోక్కసారి నా ధన్యవాదాలు. ఒక అంగీకారం అనేది లాజిక్ ఇచ్చిపుచ్చుకున్నప్పుడే వస్తుంది. నేను యావరేజ్ ఇంజినీరింగ్ స్టూడెంట్ని, పేర్ని నాని గారు ఎకనామిక్స్ గురించి నాకు ఏ బీ సీ తెలియదు. కానీ అనుమతిస్తే మీ ప్రభుత్వంలో టాప్ ఎకనామిక్స్ ఎక్స్పర్ట్ తో నేను టీవీ డిబేట్ కి రెడీ. మా సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి ఏర్పడ్డ మిస్ అండర్స్టాండింగ్ తొలగిపోవడానికి అవసరం. థ్యాంక్యూ.. పేర్ని నాని ఇచ్చిన అసమాధానాలకి ఒక పక్క సమాధానాలిస్తూనే మళ్ళీ ప్రశ్నలని లేవనెత్తారు.

RGV : ఆర్జీవి ప్రశ్నలకి సమాధానాలిచ్చిన పేర్ని నాని

మళ్ళీ ఈ ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిత్యావసరం కాని సినిమాని పట్టుకొని నిత్యావసరాల ధరల్ని ఎందుకు పెంచుతున్నారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.