RGV : ఆర్జీవి ప్రశ్నలకి సమాధానాలిచ్చిన పేర్ని నాని

నిన్న ట్విట్టర్ లో ఏపీ మంత్రి పేర్ని నానికి సినిమా టికెట్ల ధరల విషయంలో వరుస ప్రశ్నలు సంధించి సమాధానాలు ఇమ్మని అడిగాడు. పేర్ని నాని ఆర్జీవీ ప్రశ్నలకి సమాధానాలిస్తూ...........

RGV : ఆర్జీవి ప్రశ్నలకి సమాధానాలిచ్చిన పేర్ని నాని

Rgv Vs Nani

RGV :   గత కొద్ది రోజులుగా చిత్రపరిశ్రమలో ఏపీ సినిమా టికెట్ల ధరలు, ఏపీ థియేటర్ల మూసివేత హాట్ టాపిక్ గా మారింది. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు వరుసగా కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల ఈ విషయంపై సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ కూడా కామెంట్ చేశాడు. అంతే కాక వరుస పెట్టి ప్రెస్ మీట్స్ లో, ఇంటర్వ్యూలలో ఏపీ ప్రభుత్వాన్ని సినిమా టికెట్ల విషయంలో ప్రశ్నిస్తున్నాడు. నిన్న ట్విట్టర్ లో ఏపీ మంత్రి పేర్ని నానికి సినిమా టికెట్ల ధరల విషయంలో వరుస ప్రశ్నలు సంధించి సమాధానాలు ఇమ్మని అడిగాడు.

ఆర్జీవీ.. సినిమా టికెట్ రేట్లని ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుంది? వచ్చే రాబడి తగ్గితే నాణ్యత తగ్గదా? సినిమాని నిత్యావసరంగా చూస్తే వైద్య, విద్యా సేవలకు రాయితీలు ఇస్తున్నట్టు పేదలకి సినిమా టికెట్ల ధరలలో కూడా సబ్సిడీ ఇవ్వండి.. అంటూ పలు ప్రశ్నలు సంధించారు. తాజాగా ఇవాళ ఉదయం పేర్ని నాని ఆర్జీవీ అడిగిన ప్రశ్నలకి సమాధానాలిచ్చారు. అయితే కొన్ని ప్రశ్నలకి సమాధానం ఇవ్వకుండా వదిలేయడం గమనార్హం.

RGV : రాజమౌళి కంటే గొప్ప సినిమా మీరు తీసి పేదలకి ఫ్రీగా చూపించండి

పేర్ని నాని ఆర్జీవీ ప్రశ్నలకి సమాధానాలిస్తూ… గౌరవనీయులైన ఆర్జీవీ గారు మీ ట్వీట్లు చూశాను. నాకు ఉన్న సందేహాన్ని తెలియపరుస్తున్నాను. రూ.100 టికెట్ ను రూ.1000 కి, 2000కి అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనమిక్స్ చెప్పాయి? ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్ & సప్లై అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా?

సామాన్యుడి మోజుని,అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి లేకుండా చూసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 66 ఏళ్ళుగా చట్టాలకు లోబడే సినిమా టికెట్ ధరను నిర్ణయిస్తున్నాయి.

ఉప్పూ పప్పూ లాంటి నిత్యావసర వస్తువుల ధరల్ని మాత్రమే ప్రభుత్వం నియంత్రించవచ్చుగానీ, సినిమా టికెట్ల ధరల్ని ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని అడిగారు. థియేటర్లు అనేవి ప్రజా కోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలు.

బలవంతంగా ధరలు తగ్గిస్తే మోటివేషన్‌ పోతుందన్నది ఎకనామిక్స్‌లో ప్రాథమిక సూత్రం అని చెప్పారు. ఎవరికి వర్మగారూ? కొనేవారికా? అమ్మేవారికా? మీరు ఎంతవరకు ప్రొడ్యూసర్స్‌ శ్రేయస్సు గురించే మాట్లాడుతూ కన్స్యూమర్ యాంగిల్‌ను గాలికి వదిలారు. కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మ గారూ.

సినిమాను అత్యవసర సర్వీసుగా ప్రభుత్వం భావిస్తుంటే… మెడికల్, ఎడ్యుకేషన్‌ మాదిరిగానే సబ్సిడీని ప్రభుత్వం భరించాలని అడిగారు. సినిమాను మేం నిత్యావసరంగా గానీ, అత్యవసరంగా గానీ భావించటం లేదు ఆర్జీవీ గారు.

థియేటర్‌లో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెపుతున్నాయి.

హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా చెప్పారు. మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదు.

ఒక వస్తువుకు సంబంధించిన మార్కెట్‌ ధర నిర్ణయంలో అసలు ప్రభుత్వానికి ఉన్న పాత్ర ఏమిటో సమాధానమివ్వండని అడిగారు. సినిమా ఒక వస్తువు కాదు.అది వినోద సేవ మాత్రమే.ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని మేం చేస్తున్నది థియేటర్లలో టికెట్‌ ధరల నియంత్రణ మాత్రమే తప్ప, సినిమా నిర్మాణ నియంత్రణ ముమ్మాటికీ కాదు.

మీకు కింది నుంచి మద్దతు ఇవ్వటానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారని,మీ నెత్తిన ఎక్కి తొక్కటానికి కాదన్నారు.సినిమా టికెట్‌ను ఎంతకైనా అమ్ముకోనిస్తే పరిశ్రమకు కింది నుంచి బలాన్ని ఇచ్చినట్టు. సామాన్యుడిని దోచుకోకుండా ఆపితే మీ నెత్తిన ఎక్కి తొక్కినట్టు మీరు ప్రవచించటం సబబేనా వర్మ గారూ? అంటూ సమాధానాలిచ్చారు.

RGV : పేర్ని నానిపై ప్రశ్నల వర్షం కురిపించిన ఆర్జీవీ

అయితే కొన్ని ప్రశ్నలకి సమాధానాలివ్వకపోవటం, కొన్ని ప్రశ్నలకి అడిగిన దానికి కాకుండా వేరే విధంగా సమాధానాలివ్వడంతో పాటు నెటిజన్లు కామెంట్స్ చేస్తూ మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు. అంతే కాక ఏపీలో నిత్యావసర ధరలు పెరగడం, సంక్రాంతికి బస్సు టికెట్ ధరలు పెంచడం వంటివి కామెంట్లలో ఉద్దేశించి ఒక పక్క ప్రజలకి అవసరమైనవి అన్ని పెంచేస్తూ సినిమా మీద శ్రద్ద ఎందుకు అని మంత్రి నానిని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఇక ఆర్జీవీ ఈ సమాధానాలకి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి మరి.