WI vs IND : పుజారా ఔట్‌.. జైశ్వాల్ ఇన్‌.. సంజు శాంస‌న్‌కు చోటు.. వెస్టిండీస్ టూర్‌కు భార‌త వ‌న్డే, టెస్టు జ‌ట్లు ఇవే

టీమ్ఇండియా ఈ నెలాఖ‌రున వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేర‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భార‌త్‌, వెస్టిండీస్ జ‌ట్లు రెండు టెస్టులు, మూడు వ‌న్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడ‌నున్నాయి.

Team Indias squad for West Indies series

West Indies vs India : టీమ్ఇండియా ఈ నెలాఖ‌రున వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేర‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భార‌త్‌, వెస్టిండీస్ జ‌ట్లు రెండు టెస్టులు, మూడు వ‌న్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో టెస్టు, వ‌న్డే సిరీస్‌ల‌లో పాల్గొనే భార‌త జ‌ట్ల‌ను బీసీసీఐ(BCCI) శుక్ర‌వారం ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) సార‌ధ్యంలోనే భార‌త్ టెస్టులు, వన్డేలు ఆడ‌నుంది. ప్ర‌తిష్టాత్మ‌క డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్‌లో నిరాశ ప‌రిచిన న‌యావాల్ ఛ‌తేశ్వ‌ర పుజారా(Cheteshwar Pujara) పై వేటు ప‌డింది. టెస్టు జ‌ట్టులో య‌శ‌స్వి జైస్వాల్‌(Yashasvi Jaiswal), రుతురాజ్ గెక్వాడ్‌(Ruturaj Gaikwad)ల‌కు అవ‌కాశం ద‌క్క‌గా రీ ఎంట్రీలో అద్భుతంగా ఆడిన అజింక్య ర‌హానె(Ajinkya Rahane ) తిరిగి వైస్ కెప్టెన్‌గా నియ‌మితుల‌య్యాడు. అదే స‌మ‌యంలో వ‌న్డే జ‌ట్టులో సంజు శాంస‌న్‌(Sanju Samson)ను ఎంపిక చేశారు. ఇక గాయంతో బాధ‌ప‌డుతున్న కేఎల్ రాహుల్(KL Rahul), శ్రేయ‌స్ అయ్య‌ర్‌(Shreyas Iyer)లు వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌కు దూరంగా ఉన్నారు.

India tour of West Indies : వెస్టిండీస్ క‌ష్టాలు.. టెస్టు సిరీస్‌ను రీ షెడ్యూల్ చేస్తారా..?

సంజు శాంస‌న్‌, ఉమ్రాన్ మాలిక్ ఇన్‌

ఈ ఏడాది స్వ‌దేశంలో వ‌న్డే ప్ర‌పంచ‌కప్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో యువ క్రికెట‌ర్ల‌కు ఎక్కువ అవ‌కాశాలు ఇచ్చేందుకు సెల‌క్ట‌ర్లు మొగ్గు చూపారు. ఈ క్ర‌మంలో చాలా రోజుల త‌రువాత ఉమ్రాన్ మాలిక్‌కు అవ‌కాశం క‌ల్పించారు. ఇషాన్ కిష‌న్, సంజు శాంస‌న్‌ల‌ను వికెట్ కీప‌ర్లుగా ఎంపిక చేశారు. హార్ధిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. యువ బౌల‌ర్ ముకేశ్ కుమార్‌కు చోటు ద‌క్కింది. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో మూడు మ్యాచుల్లో డ‌కౌట్లు అయిన‌ప్ప‌టికీ సూర్య‌కుమార్ యాద‌వ్ త‌న స్థానాన్ని నిల‌బెట్టుకున్నాడు.

Kl Rahul : కేఎల్ రాహుల్ వ‌ర్కౌట్లు .. ఇషాన్ కిష‌న్ కామెంట్ వైర‌ల్‌.. ‘మిస్ట‌ర్ ర‌జినీ ఎందుకు అంత ఎక్స్ ట్రా..’

పుజారా పై వేటు

గ‌త కొంత కాలంగా పేల‌వ ఫామ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు ఛ‌తేశ్వ‌ర పుజారా. అయితే కౌంటీ సీజ‌న్‌లో ప‌రుగులు వ‌ర‌ద పారించ‌డంతో డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌లో అత‌డిపై భారీ ఆశ‌ల‌నే పెట్టుకోగా తీవ్రంగా నిరాశ‌ప‌రిచాడు. ఈ నేప‌థ్యంలో అత‌డిపై సెల‌క్ట‌ర్లు వేటు వేశారు. రీ ఎంట్రీలో అద‌ర‌గొట్టిన అజింక్య ర‌హానేకు తిరిగి వైస్ కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. ఇక ఐపీఎల్‌లో ప‌రుగులు వ‌ర‌ద పారించిన య‌శ‌స్వి జైస్వాల్‌, రుతురాజ్ గైక్వాడ్‌ల‌కు తొలిసారి టెస్టు జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నారు. ఉమేశ్ యాద‌వ్‌కు విశ్రాంతి నివ్వ‌గా యువ ఆట‌గాడు ముకేశ్ కుమార్ తో పాటు న‌వ్‌దీప్ సైనీకి అవ‌కాశం ఇచ్చారు.

భార‌త టెస్టు జ‌ట్టు ఇదే..

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, రుతురాజ్‌ గైక్వాడ్, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, అజింక్య రహానె (వైస్‌ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), ర‌విచంద్ర‌న్‌ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మ‌హ్మ‌ద్ సిరాజ్, ముకేశ్‌ కుమార్‌, జయ్‌దేవ్ ఉనద్కత్, నవ్‌దీప్‌సైని

Mitchell Starc : భార్య ఆట‌ను చూడాల‌ని వ‌చ్చిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెట‌ర్‌.. నిరాశ త‌ప్ప‌లేదుగా


భార‌త వ‌న్డే జ‌ట్టు ఇదే..

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, రుతురాజ్‌ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్‌ కిషన్‌ (వికెట్ కీపర్), హార్దిక్‌ పాండ్య (వైస్‌ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, జయ్‌దేవ్ ఉనద్కత్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్‌ కుమార్‌

Ashes 2023 : గెలిచినా, ఓడినా ఐసీసీ షాక్‌లు త‌ప్ప‌డం లేదుగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జ‌ట్ల‌కు భారీ జ‌రిమానా

ట్రెండింగ్ వార్తలు