IPL 2024 : ఎడారి దేశంలో ఐపీఎల్ వేలం..? ఎప్పుడంటే..?

IPL auction

IPL 2024 auction : క్రికెట్ ప్రేమికుల‌కు శుభవార్త. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2024కు స‌న్నాహాకాలు మొద‌లు కానున్నాయి. వ‌చ్చే ఏడాది ఐపీఎల్ సీజ‌న్‌కు ఈ ఏడాది ఆఖ‌రిలో వేలం ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించాల‌ని బీసీసీఐ భావిస్తోంది. ఐపీఎల్‌కు పెరుగుతున్న క్రేజ్ దృష్ట్యా ఎడారి దేశ‌మైన దుబాయ్‌లో వేలం ను నిర్వ‌హించేందుకు ఉన్న‌ అవ‌కాశాలను బీసీసీఐ ప‌రిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఖ‌చ్చిత‌మైన తేదీలు ఇంకా ఖ‌రారు కాన‌ప్ప‌టికీ డిసెంబ‌ర్ 15 నుంచి 19 మ‌ధ్య‌లో వేలం జ‌ర‌గ‌నుంద‌ని నివేదిక‌లు వ‌స్తున్నాయి.

అయితే.. ఐపీఎల్ వేలాని క‌న్నా ముందే మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) కోసం వేలం నిర్వ‌హించాల‌ని బీసీసీఐ అనుకుంటుంద‌ట‌. డిసెంబర్ 9న ఈ వేలాన్ని నిర్వ‌హించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు నివేదిక‌లు చెబుతున్నాయి. వేదిక ఇంకా ఖ‌రారు కాన‌ప్ప‌టికీ భార‌త‌దేశంలోనే ఈ వేలం జ‌రిగే అవ‌కాశం ఉంది.

ఇస్తాంబుల్‌లో నిర్వ‌హించాల‌ని భావించినా..!

గ‌త ఏడాది ఐపీఎల్ వేలాన్ని బీసీసీఐ ఇస్తాంబుల్‌లో నిర్వ‌హించాల‌ని భావించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తి అయిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఆఖ‌ర‌కు కొచ్చిలో జ‌రిగింది. అదే విధంగా ఈ సారి కూడా చివ‌రి నిమిషంలో వేదిక‌ను మార్చే అవ‌కాశాల‌ను కొట్టిపారేయ‌లేము.

Sachin Tendulkar Statue : భార‌త్‌, శ్రీలంక మ్యాచ్‌కు ముందే స‌చిన్ విగ్ర‌హావిష్క‌ర‌ణ.. ఎందుకో తెలుసా..?

ఇక వేలానికి ముందు అన్నీ ప్రాంచైజీలు కూడా తాము రిటైన్ చేసుకునే ఆట‌గాళ్ల జాబితాను బీసీసీఐకి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ విడుద‌ల చేయ‌లేదు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ముగిసిన త‌రువాత ఈ షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌నుంది. చూడాలి మ‌రీ ఏ జ‌ట్టు ఏ ఏ ఆట‌గాళ్ల‌ను అట్టిపెట్టుకుంటాయో.. ఎవ‌రిని వేలానికి విడిచిపెడ‌తాయో.

ట్రెండింగ్ వార్తలు