ప్రపంచాన్ని ప్రస్తుతం వణికిస్తున్న ఒకే ఒక్క మాట కరోనా వైరస్. ఇప్పటివరకు 110దేశాలకు పాకి 4వేల500మంది ప్రాణాలు తీసిన ఈ వైరస్ ను మహమ్మారి ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ లో కూడా కరోనా కేసులు సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనకరమైన విషయమని ఇవాళ విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ భారత పార్లమెంట్ కు తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 73కు పెరిగాయని అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ స్పందన అవసరమని ఆయన తెలిపారు. వీలైనంత వరకు ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవడం మంచిదని జైశంకర్ ప్రజలకు విజ్ణప్తి చేశారు. ప్రయాణాలు చేయడం అంటే రిస్క్ తో కూడుకున్న పనేనని ఆయన తెలిపారు.
ఇదిలా ఉంటే ఐపీఎల్ 2020పై కరోనా ప్రభావం గట్టిగా పడినట్లు అర్థమవుతోంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది ఏపీఎల్ ను నిలిపివేసే అవకాశాలపై బీసీసీఐ చర్చలు జరుపుతుందట. ఐపీఎల్ 2020ని నిలిపివేసే అవకాశాలపై బీసీసీఐలో డిస్కషన్ జరుగుతందని బోర్డు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. టీమ్ లకు నష్టపరిహారం విషయంపై శనివారం బీసీసీఐ చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ కూడా… కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహాను పాటించాలని, క్రీడా కార్యక్రమాలలో లార్జ్ గెదరింగ్(పెద్దఎత్తున ప్రజలు ఒకచోట హాజరవడం) నివారించాలని BCCIతో సహా అన్ని జాతీయ సమాఖ్యలను కోరింది.(ప్రేక్షకులు లేకుండానే..IPL మ్యాచ్‌లు!)
హెల్త్ మినిస్ట్రీ సూచలను ఫాలో అవ్వాలని, బీసీసీఐతో సహా తాము అన్ని NSF(జాతీయ క్రీడల సమాఖ్యలు)లను కోరామని స్పోర్ట్స్ సెక్రటరీ రాధే శ్యామ్ జులనియా తెలిపారు. క్రీడల యాక్టివిటీస్ తో సహా అన్నీ ఈవెంట్లలో ప్రజలు పెద్ద ఎత్తున ఒక చోట హాజరవడంను నివారించాలని కోరామని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఐపీఎల్ ను నిర్వహించకపోవడమే మంచిదని తాము నిర్వాహకులకు సూచించినట్లు విదేశాంగశాఖ తెలిపింది. ఐపీఎల్ నిర్వహించాలా వద్దా అని ఫైనల్ నిర్ణయం తీసుకునేందుకు మార్చి-14,2020న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది.
కరోనా వైరస్ దృష్యా ఇప్పటికే పలు దేశాల ప్రజలకు జారీ చేసిన వీసాలను కూడా భారత్ రద్దు చేసింది. వీసాల రద్దుతో ఏప్రిల్-15,2020వరకు విదేశీ ప్లేయర్లు భారత్ లోకి అడుగుపెట్టే అవకాశం లేదు. దీంతో విదేశీ ప్లేయర్లు ఐపీఎల్ లో పాల్గొనే ఛాన్స్ లేదు. షెడ్యూల్ ప్రాకారం…మార్చి29న ముంబై వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ తో ఐపీఎల్ 2020 ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా దృష్యా ఈ ఏడాది ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశం సృష్టంగా కనిపిస్తోంది.
ఇప్పటికే ఐపీఎల్ ను వాయిదా వేయాలని,బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వలేమని కేంద్రానికి కర్ణాటక ప్రభుత్వం లేఖ రాసింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఐపీఎల్ ను వాయిదా వేసుకోవాలని సూచించింది. మద్రాస్ హైకోర్టులోనూ వాయిదా కోరుతూ ఓ పిటిషన్ దాఖలైంది. ఇక శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఐపీఎల్ టికెట్ల అమ్మకాలపై నిషేధం విధించింది. కరోనా వైరస్ భయంతో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా వ్యతిరేకత పెరుగుతోంది.
Ministry of External Affairs (MEA) on the effect of #coronavirus on IPL: I think it is for the organizers to decide whether to go ahead with it or not. Our advice would be to not do it at this time but if they want to go ahead, it is their decision. pic.twitter.com/qFlpsrxU0D
— ANI (@ANI) March 12, 2020
మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం : సీఎం పదవిపై బీజేపీలో తర్జనభర్జనలు