BCCI key Changes in junior cricket New bone test rule
కొందరు ప్లేయర్లు నకిలీ వయసు ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తుండడం సమస్యగా మారుతోంది. ఈ క్రమంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ క్రికెట్‌లో ఆయా వయసు విభాగాల్లో పోటీపడే యువ క్రికెటర్లకు బోన్ మ్యారో (ఎముక వయసు పరీక్ష) టెస్టు చేయనున్నారు.
ప్రస్తుతం ఉన్న టీడబ్ల్యూ3పద్దతికి తోడు ఏ+1 విధానాన్ని తీసుకువచ్చింది. అంతేకాదండోయ్.. టోర్నీల్లో ఆడేందుకు పలు ప్రమాణాలను తీసుకువచ్చింది. దీనివల్ల అర్హత గల క్రికెటర్లకు నష్టం జరగదని, అన్హరులను దూరం చేయవచ్చునని బోర్డు భావిస్తోంది.
ENG vs IND : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్.. టీమ్‌ఇండియా స్క్వాడ్‌లోకి మరో ఆటగాడు..!
బాలుర అండర్-16 విభాగంలో ఎముక పరీక్ష కటాఫ్ ను 16.5 సంవత్సరాలు. అంటే పరీక్ష సమయంలో ఎముక వయసు 16.4 ఏళ్లు మాత్రమే ఉండాలి. లేదంటే ఆ సీజన్‌లో అతడికి అనుమతి ఉండదు. అదే విధంగా బాలికల అండర్-15కు 15 ఏళ్లుగా నిర్ధారించింది. ఎముక పరీక్ష సమయంలో 14.9 ఏళ్లే ఉండాలి.
ఏ+1 విధానం అంటే.. ఉదాహరణకు బాలుర అండర్-16లో ఒక ప్లేయర్ 2025-26 సీజన్‌లో బోన్ మ్యారో టెస్టు హాజరై అతడి ఫలితం 15.4 అని తేలిఏ.. అతడు వచ్చే సీజన్‌లో మళ్లీ పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేదు. ఏ+1 విధానంలో అతడి బోన్ ఏజ్ 15.5 ఏళ్లు అవుతుంది కాబట్టి అతడిని తదుపరి సీజన్‌కు అనుమతి ఇస్తారు.
వైభవ్ సూర్య వంశీ పై ఆరోపణల తరువాత..
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. కాగా.. మెగా వేలం సమయానికి అతడి వయసు 13 ఏళ్ల 288 రోజులు. ఈ క్రమంలో ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందిన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకు ఎక్కాడు. అయితే.. అతడి ఏజ్ పై ఆరోపణలు వచ్చాయి.
WTC 2025-27 : డబ్ల్యూటీసీ నాలుగో సైకిల్ షురూ.. 9 జట్లు 131 మ్యాచ్‌లు.. భారత జట్టు షెడ్యూల్ ఇదే..
అతడికి 13 ఏళ్లు కాదని, 15 అని కొందరు కామెంట్లు చేశారు. వీటిపై వైభవ్ సూర్యవంశీ తండ్రి అప్పట్లోనే స్పందించాడు. వైభవ్‌కు ఎనిమిదిన్నర ఏళ్ల వయసులో బీసీసీఐ ఎముక పరీక్షకు హాజరు అయ్యారని చెప్పాడు. ఈ విషయంలో తాము ఏ తప్పు చేయలేదని, కావాలంటే మరోసారి వైభవ్‌కు ఏజ్ పరీక్ష నిర్వహించుకోవచ్చునని తెలిపాడు.
ఇలా వైభవ్ పై ఆరోపణలు వచ్చిన కొద్ది నెలలోనే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బోన్ మ్యారో టెస్టు అనంతరమే ఆయా వయసు విభాగాల్లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.