WTC 2025-27 : డ‌బ్ల్యూటీసీ నాలుగో సైకిల్ షురూ.. 9 జ‌ట్లు 131 మ్యాచ్‌లు.. భార‌త జ‌ట్టు షెడ్యూల్ ఇదే..

డ‌బ్ల్యూటీసీ నాలుగో సైకిల్ ప్రారంభ‌మైంది.

WTC 2025-27 : డ‌బ్ల్యూటీసీ నాలుగో సైకిల్ షురూ.. 9 జ‌ట్లు 131 మ్యాచ్‌లు.. భార‌త జ‌ట్టు షెడ్యూల్ ఇదే..

WTC Fourth cycle starts 9 teams 131 matches team india schedule is this

Updated On : June 17, 2025 / 11:46 AM IST

ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ మూడో సైకిల్ (2023-25) ముగిసింది. లండ‌న్‌లోని లార్డ్స్ వేదిక‌గా జ‌రిగిన డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ద‌క్షిణాఫ్రికా విజేత‌గా నిలిచింది. ఈ సైకిల్ ఇలా ముగిసిందో లేదో నేటి (జూన్ 17 మంగ‌ళ‌వారం) నుంచి నాలుగో సైకిల్ ప్రారంభమైంది.

బంగ్లాదేశ్‌, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య గాలే వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌తో డ‌బ్ల్యూటీసీ 2025-27 సైకిల్ మొద‌లైంది. ఈ సైకిల్‌లో మొత్తం 9 జ‌ట్ల మ‌ధ్య 131 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సైకిల్‌లో ఆస్ట్రేలియా జ‌ట్టు అత్య‌ధికంగా 22 టెస్టులు ఆడ‌నుంది.

ENG vs IND : ఇంగ్లాండ్ గ‌డ్డ‌పై అత్య‌ధిక టెస్టు విజ‌యాలు సాధించిన‌ భార‌త కెప్టెన్ ఎవ‌రో తెలుసా?

ఆ త‌రువాత ఇంగ్లాండ్ 21 మ్యాచ్‌లు ఆడ‌నుంది. డ‌బ్ల్యూటీసీ 2023-25 విజేత‌గా నిలిచిన ద‌క్షిణాఫ్రికా 14 మ్యాచ్‌లు ఆడ‌నుంది. న్యూజిలాండ్ 16, బంగ్లాదేశ్‌, శ్రీలంక జ‌ట్లు చెరో 12 మ్యాచ్‌లు, వెస్టిండీస్ జ‌ట్టు 14, పాకిస్థాన్ జ‌ట్టు 13 మ్యాచ్‌లు ఆడ‌నున్నాయి.

టీమ్ఇండియా డ‌బ్ల్యూటీసీ 2025-27 షెడ్యూల్ ఇదే..

ఇక భార‌త జ‌ట్టు విష‌యానికి వ‌స్తే.. డ‌బ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో మొత్తం 18 టెస్టులు ఆడ‌నుంది. ఇందులో 9 టెస్టులు స్వ‌దేశంలో మ‌రో 9 టెస్టులు విదేశాల్లో ఆడ‌నుంది.

Digvesh Rathi : 5 బంతుల్లో 5 వికెట్లు.. ఇంత‌లోనే ఎంత మార్పు.. నోట్‌బుక్ సెల‌బ్రేష‌న్స్ ఇక ఉండ‌వా? ల‌క్నో య‌జ‌మాని సంజీవ్ గొయెంకా పోస్ట్ వైర‌ల్‌..

* ఇంగ్లాండ్ సిరీస్‌తో భార‌త జ‌ట్టు డ‌బ్ల్యూటీసీ నాలుగో సైకిల్ ప్రారంభం కానుంది. జూన్ 20 నుంచి ఆతిథ్య ఇంగ్లాండ్‌తో భార‌త్ 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడ‌నుంది.
* ఆ త‌రువాత స్వ‌దేశంలో 2025 అక్టోబ‌ర్‌లో రెండు టెస్టులు ఆడ‌నుంది.
* స్వ‌దేశంలో ద‌క్షిణాఫ్రికాతో 2025 డిసెంబ‌ర్ లో రెండు టెస్టులు ఆడ‌నుంది.
* 2026 ఆగ‌స్టు లో శ్రీలంక‌లో ప‌ర్య‌టించ‌నుంది. అప్పుడు లంక‌తో రెండు టెస్టులు ఆడ‌నుంది.
* అక్టోబ‌ర్ లేదా డిసెంబ‌ర్ 2026లో న్యూజిలాండ్‌లో ప‌ర్య‌టించ‌నుంది. ఆతిథ్య కివీస్‌తో రెండు టెస్టులు ఆడ‌నుంది.
* 2027 జ‌న‌వ‌రి-ఫిబ్ర‌వ‌రిలో స్వ‌దేశంలో ఆస్ట్రేలియాతో భార‌త్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడ‌నుంది.