Digvesh Rathi : 5 బంతుల్లో 5 వికెట్లు.. ఇంతలోనే ఎంత మార్పు.. నోట్‌బుక్ సెలబ్రేషన్స్ ఇక ఉండవా? లక్నో యజమాని సంజీవ్ గొయెంకా పోస్ట్ వైరల్..
దిగ్వేశ్ రాఠి ఐదు బంతుల్లో 5 వికెట్లు తీశాడు.

Digvesh Rathi takes Five Wickets in Five Balls lsg owner sanjiv goenka
దిగ్వేశ్ రాఠి.. ఐపీఎల్ 2025 సీజన్ ఫాలో అయిన క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. లక్నో సూపర్ జెయింట్స్ తరుపున ఆడుతూ.. వికెట్ తీసిన ప్రతి సారి నోట్‌బుక్ సంబరాలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. మొత్తం 13 మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేనా.. నోటుబక్ సెలబ్రేషన్స్ చేసుకున్నందుకు భారీ మూల్యాన్నే చెల్లించుకున్నాడు కూడా. ఐపీఎల్ 2025 సీజన్‌లో రెండు సార్లు జరిమానా, ఓ మ్యాచ్ నిషేదాన్ని కూడా ఎదుర్కొన్నాడు.
తాజాగా ఈ యువ స్పిన్నర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఓ స్థానిక లీగ్ మ్యాచ్‌లో ఈ స్టార్ స్పిన్నర్ వరుసగా 5 బంతుల్లో 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో వరుసగా నలుగురు బ్యాటర్లు క్లీన్ బౌల్డ్ కాగా.. మరో బ్యాటర్‌ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేర్చాడు.
Stumbled upon this clip of Digvesh Rathi taking 5 in 5 in a local T20 game. Just a glimpse of the talent that made him a breakout star for @LucknowIPL in IPL 2025. pic.twitter.com/i8739cjxpk
— Dr. Sanjiv Goenka (@DrSanjivGoenka) June 16, 2025
ఇందుకు సంబంధించిన వీడియోను లక్నో సూపర్ జెయింట్స్ యజమాన్ని సంజీవ్ గొయెంకా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. అతడి ప్రదర్శనను మెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నోట్‌బుక్ సెలబ్రేషన్స్ ఎక్కడ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.