ENG vs IND : ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక టెస్టు విజయాలు సాధించిన భారత కెప్టెన్ ఎవరో తెలుసా?
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూన్ 20 నుంచి 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ

Do you know Most Test wins by an Indian captain in England
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూన్ 20 నుంచి 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకున్న టీమ్ఇండియా ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్‌లు సుదీర్ఘ ఫార్మాట్ కు రిటైర్‌మెంట్ ప్రకటించిన తరువాత భారత జట్టు ఆడనున్న తొలి సిరీస్ ఇదే. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు ఎలా రాణిస్తుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.
ఇదిలా ఉంటే.. ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్లు ఎవరో ఓ సారి చూద్దాం..
విరాట్ కోహ్లీ..
ఇంగ్లాండ్ గడ్డపై విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత్ అత్యధిక టెస్టు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మొత్తం 9 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో మూడు మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
కపిల్ దేవ్..
కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ మూడు టెస్టులు ఆడింది. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. ఓ మ్యాచ్ డ్రా ముగిసింది.
రాహుల్ ద్రవిడ్..
రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో టీమ్ఇండియా మూడు టెస్టులు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఓ మ్యాచ్‌లో భారత్ గెలవగా మరో రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
సౌరవ్ గంగూలీ..
గంగూలీ కెప్టెన్సీలో భారత్ నాలుగు టెస్టులు ఆడింది. ఇందులో ఓ మ్యాచ్‌లో గెలవగా మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. మరో రెండు డ్రాగా ముగిశాయి.
India U19 : ఇంగ్లాండ్‌తో సిరీస్.. టీమ్ఇండియాకు బిగ్ షాక్.. ఇద్దరు కీలక ఆటగాళ్లకు గాయాలు..
అజిత్ వాడేకర్..
అజిత్ వాడేకర్ నాయకత్వంలో భారత్ ఆరు టెస్టులు ఆడింది. ఇందులో ఓ మ్యాచ్‌లో గెలవగా, మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మరో రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
ఎంఎస్ ధోని..
మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీలో ఇంగ్లాండ్‌లో భారత్ తొమ్మిది మ్యాచ్‌లో ఆడింది. ఇందులో ఒక్క మ్యాచ్‌లోనే టీమ్ఇండియా గెలిచింది. ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది.