India U19 : ఇంగ్లాండ్‌తో సిరీస్.. టీమ్ఇండియాకు బిగ్ షాక్.. ఇద్దరు కీలక ఆటగాళ్లకు గాయాలు..
భారత అండర్-19 జట్టు ఈ నెల చివరిలో ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది.

India U19 Two Star Players Ruled Out Of England Tour
భారత అండర్-19 జట్టు ఈ నెల చివరిలో ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఈ నెల 24 నుంచి ఆతిథ్య ఇంగ్లాండ్‌తో మల్టీ ఫార్మాట్ సిరీస్‌ను ఆడనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో పాల్గొనే భారత అండర్-19 జట్టును ఎంపిక చేయగా.. తాజాగా ఈ జట్టులోని ఇద్దరు కీలక ఆటగాళ్లు గాయపడ్డారు.
ఇంగ్లాండ్ పర్యటన కోసం బీసీసీఐ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో అండర్-19 ఆటగాళ్ల కోసం ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ శిబిరంలో ప్రాక్టీస్ చేస్తూ ఆదిత్య రాణా, ఖిలన్ పటేల్ లు గాయపడ్డారు. ఆదిత్య వెన్ను భాగంలో స్ట్రెస్ ఫ్రాక్చర్‌కు గురి కాగా.. ఖిలన్ పటేల్ కుడి కాలికి గాయమైంది.
ENG vs IND : మరో నాలుగు రోజుల్లో ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు.. భారత జట్టుకు శుభవార్త..
వీరి గాయాలు తీవ్రమైనవి కావడంతో ఈ ఇద్దరు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లరని సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ తెలియజేసింది. వీరిద్దరి స్థానాల్లో దీపేశ్, నమన్ పుష్పక్‌లకు ఎంపిక చేసింది. దీపక్, నమన్‌లు ఇంగ్లాండ్ టూర్‌కు స్టాండ్ బై ప్లేయర్లుగా ఉండగా.. తాజాగా జట్టులోకి తీసుకున్నారు.
ఇంగ్లాండ్‌లో జరుగబోయే మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో ఆయుశ్ మాత్రే సారథ్యంలో భారత్ ఆడనుంది. ఐపీఎల్ లో దుమ్ములేపిన వైభవ్ సూర్యవంశీ సైతం జట్టులో చోటు దక్కించుకున్నాడు.
🚨 NEWS 🚨
India U19 Squad for Tour of England: Injury and Replacement Updates
Details 🔽 #TeamIndiahttps://t.co/QUoyh7ymij
— BCCI (@BCCI) June 16, 2025
ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు ఓ 50 ఓవర్ల వార్మప్ మ్యాచ్, 5 వన్డేలు, రెండు మల్టీ డే మ్యాచ్‌లు (టెస్ట్‌లు) ఆడుతుంది.
ఇంగ్లాండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత అండర్-19 జట్టు ఇదే..
ఆయుశ్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సిన్హ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్-కెప్టెన్), హర్వాన్ష్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్ ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, నమన్ పుష్పక్, హెనిల్ పటేల్, యుద్దజిత్ గుహా, అన్మోల్జీత్ సింగ్, ప్రణవ్ రాఘవేంద్ర, మొహమ్మద్ ఎనాన్, దీపేశ్,
స్టాండ్‌బై ప్లేయర్స్: వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారీ, అలంకృత్ రాపోల్ (వికెట్‌కీపర్)