ENG vs IND : మ‌రో నాలుగు రోజుల్లో ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు.. భార‌త జ‌ట్టుకు శుభ‌వార్త‌..

సిరీస్‌కు మ‌రో నాలుగు రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌గా.. ఇప్పుడు టీమ్ఇండియాకు శుభ‌వార్త అందింది.

ENG vs IND : మ‌రో నాలుగు రోజుల్లో ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు.. భార‌త జ‌ట్టుకు శుభ‌వార్త‌..

Good news to Team India Gautam Gambhir to leave for England tonight

Updated On : June 16, 2025 / 5:07 PM IST

భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌కు మ‌రో నాలుగు రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌గా.. ఇప్పుడు టీమ్ఇండియాకు శుభ‌వార్త అందింది. ఫ్యామిలీ ఎమ‌ర్జెన్సీ కార‌ణంగా స్వదేశానికి వ‌చ్చిన హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ మంగ‌ళ‌వారం టీమ్ఇండియాతో క‌ల‌వ‌నున్నాడు.

త‌ల్లికి గుండెపోటు రావ‌డంతో గంభీర్ జూన్ 11న స్వ‌దేశానికి వ‌చ్చాడు. ఇప్పుడు ఆమె ఆరోగ్యం కాస్త మెరుగుప‌డ‌డంతో తిరిగి లండ‌న్‌కు వెళ్లేందుకు గంభీర్ సిద్ద‌మైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. సోమ‌వారం (జూన్ 16న‌) సాయంత్రం ఇంగ్లాండ్ విమానం ఎక్క‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. మంగ‌ళ‌వారం (జూన్ 17న‌) జ‌ట్టుతో చేర‌నున్నాడు.

Kuldeep Yadav : రోహిత్ శ‌ర్మ సీటును ఆక్ర‌మించిన కుల్దీప్ యాద‌వ్‌..

ల‌క్ష్మ‌ణ్ నేతృత్వంలో..

గంభీర్ స్వ‌దేశానికి రావ‌డంతో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీయస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో భార‌త జ‌ట్టు ప్రాక్టీస్ సెష‌న్ల‌లో పాల్గొంటున్న‌ట్లుగా తెలుస్తోంది. వాస్త‌వానికి టీమ్ఇండియాతో కాకుండా వ్య‌క్తిగ‌త ప‌నుల మీద లక్ష్మణ్ ఇంగ్లాండ్‌కు వెళ్లాడు. అయితే.. హ‌ఠాత్తుగా గంభీర్ స్వదేశానికి రావ‌డంతో ల‌క్ష్మ‌ణ్ ను లండ‌న్‌ కు బీసీసీఐ పంపిన‌ట్లు క్రిక్‌బ‌జ్ తెలిపింది.

Karun Nair : ఓ టీమ్ఇండియా స్టార్ క్రికెట‌ర్ ఫోన్ చేసి మ‌రీ రిటైర్ క‌మ్మ‌ని చెప్పాడు.. క‌రుణ్ నాయ‌ర్ షాకింగ్ కామెంట్స్‌..

ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు భార‌త జ‌ట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జ‌స్‌ప్రీత్‌ బుమ్రా, ప్ర‌సిద్ద్ కృష్ణ‌, సిరాజ్, కుల్దీప్ యాద‌వ్‌, ఆకాశ్ దీప్‌, అర్ష్‌దీప్ సింగ్‌.