BCCI : ఏడాదికి బీసీసీఐ ఆదాయం ఎంతో తెలుసా..? ఆస్ట్రేలియాతో పోలిస్తే ఎక్కువా..? త‌క్కువా..?

Board of Control for Cricket in India : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నిక క్రికెట్ బోర్డుగా కొన‌సాగుతోంది.

BCCI net worth is over 18700 crore

భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నిక క్రికెట్ బోర్డుగా కొన‌సాగుతోంది. ప్ర‌తీ సంవ‌త్స‌రం కూడా త‌న ఆదాయాన్ని పెంచుకుంటూ పోతుంది. ఈ విష‌యంలో మిగ‌తా దేశాల క్రికెట్ బోర్డులు చాలా వెన‌క బ‌డి ఉన్నాయ‌ని చెప్పొచ్చు. క్రిక్‌బ‌జ్ క‌థ‌నం ప్ర‌కారం.. బీసీసీఐ ఆస్తుల విలువ సుమారు 2.25 బిలియ‌న్ డాల‌ర్లు అంటే భార‌త క‌రెన్సీలో రూ.18,760 కోట్లు. ఇక రెండో స్థానంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఉంది.

ఆస్ట్రేలియా బోర్డు వార్షిక ఆదాయం 79 మిలియ‌న్ డాల‌ర్లు అంటే భార‌త క‌రెన్సీలో సుమారు రూ.660కోట్లు. ఈ లెక్క‌న ఆసీస్ ఆదాయం కంటే బీసీసీఐ ఆదాయం దాదాపు 28 రెట్లు అధికం అన్న‌మాట‌. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఈ జాబితాలో మూడో స్థానంలో కొన‌సాగుతోంది. ఈసీబీ నెట్‌వర్త్‌ 59 మిలియన్‌ డాలర్లు అంటే భార‌త క‌రెన్సీలో సుమారు రూ.490 కోట్లుగా ఉంది.

Ajaz Patel : విచిత్ర బౌల‌ర్‌.. స్వ‌దేశంలో నో వికెట్.. కానీ విదేశాల్లో 62 వికెట్లు..! భార‌త సంత‌తి ఆట‌గాడే

బోర్డుల‌కు ఆదాయం ఎలా వ‌స్తుందంటే..?

మీడియా రైట్స్‌, స్పాన్స‌ర్ షిప్‌ల ద్వారా బోర్డులు ఆదాయాన్ని ఆర్జిస్తాయి. అంతేకాకుండా టికెట్ల అమ్మ‌కాల ద్వారా కూడా ఆదాయం స‌మ‌కూరుతుంది. ఇక బీసీసీఐ విష‌యానికి వ‌స్తే మాత్రం ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా పెద్ద మొత్తంలో సంపాదిస్తుంది. ముఖ్యంగా ఐపీఎల్ ప్ర‌సార హ‌క్కుల ద్వారా భారీగానే ఆర్జించింది. 2023 నుంచి 2027 వ‌ర‌కు ఐపీఎల్ ప్ర‌సార హ‌క్కులను అమ్మ‌డం ద్వారా మూడు వేరువేరు సంస్థ‌లు క‌లిపి బీసీసీఐకి రూ.48,390.32 కోట్లు చెల్లిస్తున్నాయి.

దాదాపు 12 ఏళ్ల త‌రువాత వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు భార‌త్ ఆతిథ్యం ఇచ్చింది. ఈ మెగాటోర్నీలో వ‌రుస‌గా 10 మ్యాచుల్లో గెలిచి ఫైన‌ల్‌కు చేరిన భార‌త్ ఆఖ‌రి మ్యాచులో మాత్రం ఓడిపోయింది. టీమ్ఇండియా ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడ‌న‌ప్ప‌టికీ భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌లోకి భారీగా న‌గ‌దు ప్ర‌వాహం వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఎక‌నామిక్స్ టైమ్స్ నివేదిక ప్ర‌కారం దాదాపు రూ.22 వేల కోట్లు ప్ర‌పంచ‌క‌ప్ ద్వారా ఆర్థిక వ్య‌వ‌స్థ‌లోకి వ‌చ్చాయి.

Abu Dhabi T10 League : టీ10 క్రికెట్‌లో పెను సంచ‌ల‌నం.. మొద‌టి ఓవ‌ర్‌లోనే హ్యాట్రిక్.. 6 ప‌రుగులిచ్చి 5 వికెట్లు..

ట్రెండింగ్ వార్తలు