BCCI president Sourav Ganguly : బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 2021, జనవరి 02వ తేదీ శనివారం మధ్యాహ్నం ఆయన కోల్ కతాలోని వుడ్ లాండ్ ఆసుపత్రిలో చేరారు. ఉదయం జిమ్‌లో ఎక్సర్ సైజ్ చేస్తుండగా.. గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఆయనకు సర్జరీ చేస్తారని సమాచారం.
ఇటీవలే..ఆయన 22 సార్లు కరోనా టెస్టులు చేయించుకున్న సంగతి తెలిసిందే. నాలుగున్నర నెలల కాలంలో 22 సార్లు కరోనా టెస్టులు చేయించుకున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ 22 టెస్టుల్లో ఏ ఒక్కసారి కూడా తనకు పాజిటివ్‌గా రాలేదన్నారు. యూఏఈలో నిర్వహించిన ఐపీఎల్ టోర్నీ సందర్భంగా అక్కడ పర్యటించాల్సి వచ్చిందని, ఆ తర్వాత దేశంలో కూడా పర్యటించే సమయంలో ఈ టెస్టులు చేయించుకున్నట్లు వెల్లడించారు.
మరోవైపు..సౌరవ్ గంగూలీ.. రాజకీయాల్లో రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీని ఎదుర్కొనేందుకు గంగూలీని బీజేపీలో చేర్చుకుంటున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న క్రమంలో ఆదివారం వెస్ట్ బెంగాల్ గవర్నర్ ను గంగూలీ కలవడం చర్చనీయాంశమైంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన కార్యక్రమంలో గంగూలీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వేదిక పంచుకోవడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది.