CSK Team: స‌న్‌రైజ‌ర్స్‌తో మ్యాచ్‌కు ముందు సీఎస్‌కేకు కోలుకోలేని షాక్‌.. 4 కోట్ల ప్లేయ‌ర్ టోర్నీ నుంచి ఔట్‌..

IPL 2026 CSK Khaleel Ahmed: స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో మ్యాచ్‌కు ముందు సీఎస్‌కేకు(CSK) భారీ ఎదురుదెబ్బ త‌గిలింది.

Big blow to CSK Pacer Khaleel Ahmed ruled out of IPL 2026 (pic credit@ipl)

  • వ‌రుస విజ‌యాల‌తో జోష్‌లో ఉన్న చెన్నైకు షాక్‌
  • మంగ‌ళ‌వారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో గాయ‌ప‌డిన పేస‌ర్ ఖ‌లీల్ అహ్మ‌ద్
  • స్కానింగ్‌లో గాయం తీవ్ర‌త‌పై స్ప‌ష్ట‌త
  • కోలుకునేందుకు 10 నుంచి 12 వారాల స‌మ‌యం
  • మిగిలిన సీజ‌న్ నుంచి త‌ప్పుకున్న ఖ‌లీల్ అహ్మ‌ద్

IPL CSK Team: ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో వైఫ‌ల్యాల బాట వ‌దిలి వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది చెన్నై సూప‌ర్ కింగ్స్‌. ప్ర‌స్తుతం గెలుపు జోష్‌లో ఉంది. అదే ఉత్సాహంలో శ‌నివారం (ఏప్రిల్ 18) స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో త‌ల‌ప‌డేందుకు సిద్ధ‌మ‌వుతోంది. హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది.

అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు సీఎస్‌కే జ‌ట్టుకు భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్ ఖ‌లీల్ అహ్మ‌ద్ గాయం కార‌ణంగా ఐపీఎల్ 2026లో మిగిలిన సీజ‌న్ మొత్తానికి దూరం అయ్యాడు.

*కోహ్లీ, బ‌ట్ల‌ర్‌, వార్న‌ర్ రికార్డులు బ్రేక్‌.. టీ20 క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన బాబ‌ర్ ఆజామ్‌..

ఏప్రిల్ 14న కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఖ‌లీల్ అహ్మ‌ద్ గాయ‌ప‌డ్డాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఇన్నింగ్స్ 17వ ఓవ‌ర్‌ను ఖ‌లీల్ అహ్మ‌ద్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో చివ‌రి బంతి వేసేందుకు ర‌న్న‌ప్ తీసుకుంటున్న స‌మ‌యంలో అత‌డి కుడి తొడ కండ‌రాలు ప‌ట్టేశాయి. ఫిజియో వ‌చ్చి అత‌డికి చికిత్స అందించినా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. దీంతో అత‌డు మైదానాన్ని వీడాడు. ఈ ఓవ‌ర్‌లో మిగిలిన ఒక్క బంతిని గుర్జాప‌నీత్ సింగ్ వేశాడు.

మ్యాచ్ అనంత‌రం చికిత్స నిమితం ఖలీల్ అహ్మ‌ద్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ అత‌డికి స్కానింగ్ నిర్వ‌హించారు. స్కానింగ్‌లో అత‌డి కండ‌రాల్లో ప‌గుళ్లు ఉన్న‌ట్లు క‌నిపించింది. దీని నుంచి కోలుకునేందుకు క‌నీసం 10 నుంచి 12 వారాల స‌మ‌యం ప‌డుతుంద‌ని వైద్యులు తెలిపారు. దీంతో ఖ‌లీల్ అహ్మ‌ద్ ఈ సీజ‌న్ నుంచి త‌ప్పుకున్నాడు.

*చిన్న‌స్వామి స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ఘోర అవ‌మానం..! బీసీసీఐకి ఫిర్యాదు చేసిన సీఎస్‌కే.. ‘దోస, ఇడ్లీ, సాంబార్..’

ఈ ఎడ‌మ‌చేతి వాటం పేస‌ర్ ఐదు మ్యాచ్‌ల్లో రెండు వికెట్లు మాత్ర‌మే తీశాడు. అయిన‌ప్ప‌టికి సీఎస్‌కే బౌల‌ర్ల‌లో అత‌డిది రెండో అత్యుత్త‌మ ఎకాన‌మీ (8.67) కావ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే ధోని సేవ‌ల‌కు కోల్పోయిన సీఎస్‌కు ఇప్పుడు ఖ‌లీల్ కూడా దూరం కావ‌డం గ‌ట్టి ఎదురుదెబ్బ‌గానే చెప్పవ‌చ్చు. ఈ సీజ‌న్‌కు ముందు ఖ‌లీల్‌ను సీఎస్‌కే 4.8 కోట్ల‌కు సీఎస్‌కే రిటైన్ చేసుకుంది.