Big shock to England Gus Atkinson ruled out fifth Ashes Test in Sydney
AUS vs ENG : యాషెస్ సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయినప్పటికి నాలుగో టెస్టులో గెలవడం ఇంగ్లాండ్ జట్టులో మంచి జోష్ ను తెచ్చింది. ఇక ఇదే ఉత్సాహంలో ఆఖరిదైన ఐదో టెస్టు మ్యాచ్‌లోనూ గెలుపొంది సిరీస్‌ను విజయంతో ముగించాలని ఇంగ్లాండ్ ఆరాటపడుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ సిడ్నీ వేదికగా భారత కాలమానం ప్రకారం జనవరి 4 నుంచి 8 వరకు జరగనుంది.
నాలుగో టెస్టు మ్యాచ్‌లో గెలిచి మంచి జోష్‌లో ఉన్న ఇంగ్లాండ్ కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ గస్ అట్కిన్సన్ గాయంతో ఐదో టెస్టుకు దూరం అయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
Gautam Gambhir : గంభీర్ నువ్వు కూడా రంజీ జట్లకు కోచ్‌గా వెళ్లు.. అప్పుడే..
గస్ అట్కిన్సన్‌కు ఏమైందంటే?
నాలుగో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట సందర్భంగా బౌలింగ్ చేసే క్రమంలో గస్ అట్కిన్సన్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు నొప్పితో మైదానాన్ని వీడాడు. ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో అతడికి మూడు వారాల విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలోనే అతడు ఐదో టెస్టుకు దూరం అయ్యాడు.
ఇంగ్లాండ్ ఇప్పటికే మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్ సేవలకు కోల్పోయింది. ఇక ఇప్పుడు గస్ అట్కిన్సన్ సైతం దూరం కావడం ఇంగ్లాండ్‌కు ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. కాగా.. అతడి స్థానంలో ఇంగ్లాండ్ ఎవరిని ఎంపిక చేయలేదు. యువ పేసర్లు మాథ్యూ పాట్స్, మాథ్యూ ఫిషర్ లు జట్టులోనే ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఐదో టెస్టులో బరిలోకి దిగనున్నారు.
Wishing you a speedy recovery, Gus 🙏
— England Cricket (@englandcricket) December 29, 2025
వాస్తవం చెప్పాలంటే ఈ సిరీస్‌లో గస్ అట్కిన్సన్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మూడు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు తీశాడు.