Nikhat Zareen : బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్‌కు డీఎస్పీ ఉద్యోగం…

భార‌త స్టార్ బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్ డీఎస్సీగా నియ‌మితుల‌య్యారు.

Boxer Nikhat Zareen Appointed DSP by Telangana Police

Nikhat Zareen : భార‌త స్టార్ బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్ డీఎస్సీగా నియ‌మితుల‌య్యారు. ప్రపంచ మహిళా బాక్సింగ్‌లో గోల్డ్‌ మెడల్ సాధించిన నిజామాబాద్ ముద్దు బిడ్డ నిఖ‌త్‌కు తెలంగాణ‌ రాష్ట్ర ప్ర‌భుత్వం భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. జూబ్లీహిల్స్‌లో 600 గజాల ఇంటి స్థ‌లంతో పాటు గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగాన్ని ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పింది.

ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం ఆమెను డీఎస్పీగా నియ‌మించింది. బుధ‌వారం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ పోలీస్) గా నిఖ‌త్ జ‌రీన్ జాయినింగ్ రిపోర్ట్ ను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ కు అందజేశారు. నిఖత్ జరీన్‌కు మూడేళ్ల పాటు ప్రొబెష‌న‌రీ ట్రైనింగ్‌ ఉంటుంది.

IPL 2025 : పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్‌గా రికీ పాంటింగ్‌.. ఢిల్లీ పొమ్మంటే..

నిఖ‌త్ జ‌రీన్‌ రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. కామ‌న్వెల్త్‌గేమ్స్‌లో గోల్డ్‌మెడ‌ల్‌ను, ఏషియ‌న్ గేమ్స్‌లో బ్రాంజ్ మెడ‌ల్‌ను గెల‌చుకుంది. ఒలింపిక్స్ 2024 లో ఆమె పాల్గొంది. భారీ అంచ‌నాల‌తో బ‌రిలోకి దిగిన నిఖ‌త్ అనూహ్యంగా సెమీ ఫైనల్స్ కూడా చేర‌కుండానే నిష్ర్క‌మించింది.