IPL 2025 : పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్‌గా రికీ పాంటింగ్‌.. ఢిల్లీ పొమ్మంటే..

పంజాబ్ కింగ్స్ త‌మ హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ నియ‌మించింది.

IPL 2025 : పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్‌గా రికీ పాంటింగ్‌.. ఢిల్లీ పొమ్మంటే..

Punjab Kings appoint Ponting as head coach ahead of 2025 IPL season

Updated On : September 18, 2024 / 7:00 PM IST

Punjab Kings – Ponting : ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు చాలా స‌మ‌య‌మే ఉంది. అయితే.. ఈ ఏడాది చివ‌రిలో మెగా వేలం జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో జ‌ట్టును బ‌లోపేతం చేసుకునే దిశ‌గా అన్ని ఫ్రాంఛైజీలు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. రిటైన్ష‌న్ చేసుకోవాల్సిన ఆట‌గాళ్ల జాబితాతో పాటు వేలంలో ఎవ‌రిని కొనుగోలు చేయాల‌నే దానిపై దృష్టిసారించాయి. అంతేనా త‌మ కోచింగ్ స్టాఫ్‌ను మార్చివేస్తున్నాయి. తాజాగా పంజాబ్ కింగ్స్ త‌మ హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ నియ‌మించింది.

ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పంజాబ్ వెల్ల‌డించింది. ట్రెవర్ బేలిస్ స్థానంలో పాంటింగ్ హెడ్ కోచ్‌గా బాధ్య‌త‌లు అందుకోనున్నాడు.

IND vs BAN : ఇదేం పిచ్ రా అయ్యా.. అర్థ‌మైన‌ట్లే ఉంది గానీ.. చెపాక్ పిచ్‌పై బంగ్లాదేశ్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

దీనిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా పాంటింగ్ ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. పంజాబ్ కింగ్స్‌కు హెడ్‌కోచ్‌గా రావ‌డం సంతోషంగా ఉంద‌న్నాడు. కొత్త స‌వాళ్ల‌ను ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పాడు. జ‌ట్టు యాజ‌మాన్యం, మేనేజ్‌మెంట్‌తో త‌న‌కు మంచి అనుబంధం ఉంద‌ని, త‌ప్ప‌కుండా అభిమానుల‌కు కొత్త పంజాబ్ కింగ్స్ టీమ్‌ను చూపించేందుకు త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని తెలిపాడు.

ఇదే క‌దా మాకు కావాల్సింది.. ఫ్రెండ్స్ అయిపోయిన కోహ్లి, గంభీర్.. జోకులేసుకొని తెగ..

దాదాపు ఏడేళ్ల పాటు ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు హెడ్ కోచ్‌గా రికీ పాంటింగ్ సేవ‌ల‌ను అందించాడు. అయితే.. ఐపీఎల్ 2024 ముగిసిన అనంత‌రం ఢిల్లీ అత‌డిని వ‌దులుకుంది. ఈ క్ర‌మంలో పంజాబ్ ఫ్రాంఛైజీలో పాంటింగ్ చేరాడు. ఇక పంజాబ్ కింగ్స్‌కు ఐపీఎల్ ట్రోఫీ అంద‌ని ద్రాక్ష‌గానే ఉంది. అందుక‌నే పాంటింగ్ అనుభ‌వంతో ఈ సారి క‌ప్పును ముద్దాడాల‌ని భావిస్తోంది. ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో పంజాబ్ తొమ్మిదో స్థానంలో నిలిచిన సంగ‌తి తెలిసిందే.