ఇదే కదా మాకు కావాల్సింది.. ఫ్రెండ్స్ అయిపోయిన కోహ్లి, గంభీర్.. జోకులేసుకొని తెగ..
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ, మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్‌లు గతంలో పడేది కాదు.

IND vs BAN You would know better Gautam Gambhirs quip cracks up Virat Kohli
Gautam Gambhir-Virat Kohli : టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ, మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్‌లకు గతంలో పడేది కాదు. ఓ ఐపీఎల్ సీజన్ లో వీరిద్దరి మధ్య జరిగిన గొడవను అంత త్వరగా ఎవ్వరూ మరిచిపోలేరు. టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎంపిక కావడంతో కోహ్లీకి ఇక కష్ట కాలం తప్పదని వార్తలు వచ్చాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతాయని కొందరు అభిమానులు భయపడ్డారు కూడా. మ్యాచుల సందర్భంలో గొడవలు సహజం అని, తామిద్దరం వాటి గురించి ఎప్పుడో మరిచిపోయామని, దేశం కోసం ఆడేటప్పుడు జట్టు విజయం గురించి తప్ప ఇంకా వేటి గురించి ఆలోచించడం లేదని వీరిద్దరు అప్పట్లోనే చెప్పారు. అయినప్పటికి కూడా రూమర్లు ఆగలేదు.
ఈ క్రమంలో వీటికి ఫుల్‌స్టాప్ పెట్టేలా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో వీరిద్దరు ఎంతో సరదాగా మాట్లాడుకున్నారు. ఇద్దరు భారత జట్టుకు కలిసి ఆడిన సందర్భంతో పాటు మైదానంలో గొడవల గురించి కూడా సంభాషించుకున్నారు.
విరాట్ కోహ్లి : మీరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్లతో అప్పుడప్పుడు మాట్లాడుతుంటేవారు. దీంతో మీ ఏకాగ్రత దెబ్బతినేదా? ఔట్ అయ్యేవారా? లేదంటే.. వారి కవ్వింపు చర్యలు మీలో మరింత స్ఫూర్తి రగిలించేవా?
ఈ ప్రశ్నకు నువ్వే సరైన సమాధానం చెప్పగలవు. ఎందుకంటే నాకంటే నువ్వే ఎక్కువగా మైదానంలో గొడవలు పెట్టుకున్నావు గదా అని గంభీర్ సమాధానం ఇచ్చాడు. దీంతో కోహ్లీ నవ్వుతూ.. తాను చెప్పేదానికి ఏకీభవించే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. అలా చేయడం తప్పేమీ కాదన్నాడు. అయితే.. ఆటలో ఇవన్నీ సహజం అని కనీసం ఒకరైనా చెప్పేవారు ఉండాలి అని అన్నాడు. ఇలాంటి సందర్భాల్లో తనకు నష్టం కంటే లాభం ఎక్కువగా జరిగిందన్నాడు. పరుగులు ఎక్కువగా చేసేవాడినని అన్నారు.
IND vs BAN : భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టెస్టు సిరీస్.. ఫ్రీగా మ్యాచులను ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
ఇక వీడియో ఆఖరిలో కోహ్లీ మాట్లాడుతూ.. ఇప్పటికే చాలా దూరం వచ్చాము. ఈ మసాలాకు చెక్ పెట్టామనే అనుకుంటున్నాము అని అన్నాడు. ఒకప్పుడు గౌతమ్ గంభీర్‌తో కలిసి ఆడిన కోహ్లీ.. ఇప్పుడు అతడి కోచింగ్‌లో ఆడుతున్నాడు.
2011 వన్డే ప్రపంచకప్ ను భారత్ గెలుచుకోవడంలో కోహ్లీ, గంభీర్ లు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఒకరు ఆటగాడిగా మరొకరు కోచ్‌గా ప్రపంచ క్రికెట్‌లో భారత్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కలిసి పని చేస్తున్నారు.
A Very Special Interview 🙌
Stay tuned for a deep insight on how great cricketing minds operate. #TeamIndia’s Head Coach @GautamGambhir and @imVkohli come together in a never-seen-before freewheeling chat.
You do not want to miss this! Shortly on https://t.co/Z3MPyeKtDz pic.twitter.com/dQ21iOPoLy
— BCCI (@BCCI) September 18, 2024