IND vs BAN : భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టెస్టు సిరీస్.. ఫ్రీగా మ్యాచులను ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
భారత్, బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు రంగం సిద్ధమైంది.

India vs Bangladesh Test series
India vs Bangladesh : భారత్, బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు రంగం సిద్ధమైంది. శ్రీలంకతో సిరీస్ తరువాత 45 రోజుల సుదీర్ఘ విరామం అనంతరం భారత ఆటగాళ్లు మైదానంలో అడుగుపెట్టనున్నారు. రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు చెన్నైకి చేరుకున్నారు. టెస్టు సిరీస్ కోసం తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. విజయం సాధించేందుకు పలు వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు.
పాక్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన ఉత్సాహంలో ఉంది బంగ్లాదేశ్. అదే జోష్‌లో టీమ్ఇండియాకు షాక్ ఇవ్వాలని ఆరాటపడుతోంది. మరోవైపు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవాలంటే ప్రతి టెస్టు మ్యాచ్ భారత్‌కు కీలకం. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉంది.
Asian Champions Trophy : ఐదోసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్
వచ్చే ఏడాది మార్చి చివరి వరకు తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడతాయి. ఈ క్రమంలో బంగ్లాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలో సిరీస్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.
ఫ్రీగా మ్యాచులను ఎక్కడ చూడొచ్చు?
దీంతో ఈ సిరీస్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి టెస్టు మ్యాచ్ సెప్టెంబర్ 19 నుంచి 23 వరకు జరగనుండగా, రెండో టెస్టు మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌లు హాట్‌స్టార్‌లో రావు. మరీ మ్యాచులను ఎలా చూడొచ్చొ తెలుసా?
Neeraj Chopra : నీరజ్ చోప్రాను ఫోన్ నంబర్ అడిగిన లేడీ ఫ్యాన్.. మనుభాకర్‌కు తెలిస్తే?
భారత్, బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌కు సంబంధించి స్పోర్ట్స్ 18, జియో సినిమాలు అధికారిక బ్రాడ్‌కాస్టర్స్‌గా వ్యవహరిస్తున్నాయి. టీవీల్లో స్పోర్ట్స్ 18 ఛానెల్‌లో ప్రత్యక్షప్రసారం కానుండా ఓటీటీలో జియో సినిమాలో వస్తుంది. జియో సినిమాలో మ్యాచులను ఫ్రీగా చూడొచ్చు.