Neeraj Chopra : నీర‌జ్ చోప్రాను ఫోన్ నంబ‌ర్ అడిగిన లేడీ ఫ్యాన్.. మ‌నుభాకర్‌కు తెలిస్తే?

వ‌రుస‌గా రెండు ఒలింపిక్స్‌లోనూ ప‌త‌కాలు సాధించాడు భార‌త జావెలిన్ స్టార్ నీర‌జ్ చోప్రా.

Neeraj Chopra : నీర‌జ్ చోప్రాను ఫోన్ నంబ‌ర్ అడిగిన లేడీ ఫ్యాన్.. మ‌నుభాకర్‌కు తెలిస్తే?

Fan asks Neeraj Chopra for his phone number video goes viral

Updated On : September 17, 2024 / 5:12 PM IST

Neeraj Chopra – Viral video : వ‌రుస‌గా రెండు ఒలింపిక్స్‌లోనూ ప‌త‌కాలు సాధించాడు భార‌త జావెలిన్ స్టార్ నీర‌జ్ చోప్రా. మ‌న దేశంలోనే కాదు విదేశాల్లోనూ అత‌డికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ క్ర‌మంలో అత‌డు ఎక్క‌డ క‌నబ‌డినా కూడా ఫ్యాన్స్ సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు అంటూ అత‌డి వెంట‌ప‌డుతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇందులో ఏం ఉంద‌ని అంటారా..? ఓ లేడీ ఫ్యాన్.. నీర‌జ్ ఫోన్ నంబ‌ర్ అడిగింది.

ఈ వీడియోలో ఇద్ద‌రు మ‌హిళ‌లు నీర‌జ్‌తో సెల్ఫీలు దిగారు. ఇందులో ఓ మ‌హిళ మీ ఫోన్ ఇస్తారా ? అంటూ నీర‌జ్‌ను అడిగింది. ఊహించ‌ని ఈ ప్ర‌శ్న‌తో కాస్త కంగారు ప‌డ్డ నీర‌జ్ త‌రువాత సున్నితంగా ఆ ప్ర‌శ్న‌ను దాట‌వేశాడు. ఇది ఎప్పుడు ఎక్క‌డ జ‌రిగింది అన్న విష‌యాలు అయితే తెలియ‌రాలేదు. ఈ వీడియో వైర‌ల్‌గా మార‌గా.. బెల్జియంలోని బ్ర‌స్సెల్స్‌లో జ‌రిగిన డైమండ్ లీగ్ ఫైన‌ల్ సంద‌ర్భంగా చోటు చేసుకుంద‌ని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం ఈ విష‌యం షూట‌ర్ మ‌ను భాక‌ర్ తెలిస్తే బాగోద‌ని, బెండు తీస్తుంద‌ని అంటున్నారు.

Womens T20 World Cup prize money : ఐసీసీ కీల‌క నిర్ణ‌యం.. 225 శాతం పెరిగిన మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప్రైజ్‌మ‌నీ

కాగా.. ఒలింపిక్స్ స‌మ‌యంలో నీర‌జ్‌, మ‌ను లు స‌న్నిహితంగా మెల‌గ‌డంతో వీరిద్ద‌రు ప్రేమ‌లో ఉన్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. దీనికి తోడు మ‌నుభాక‌ర్ త‌ల్లి నీర‌జ్‌తో మాట్లాడుతూ త‌న త‌ల‌పై ఒట్టు వేయించుకోవ‌డం వైర‌ల్‌గా మారింది. దీంతో నీర‌జ్‌, మ‌నులు ప్రేమ‌లో ఉన్నార‌ని త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోనున్నారు అనే వార్త‌ల‌కు బ‌లం చేకూరింది.

అయితే.. గ‌తంలోనే దీనిపై మ‌ను భాక‌ర్ స్పందించింది.. అలాంటిది ఏమీ లేదంది. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె నీర‌జ్ గురించి మాట్లాడుతూ.. అత‌డు చాలా గొప్ప‌వాడ‌ని, ఎంతో మందికి స్ఫూర్తిదాత‌గా నిలిచాడ‌ని ప్ర‌శంసించింది. దీంతో మ‌రోసారి వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం న‌డుస్తోంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

Yashasvi Jaiswal : కోహ్లీ వ‌ల్ల కాలేదు.. యశస్వి జైస్వాల్ అందుకుంటాడా?

ఇదిలా ఉంటే.. డైమండ్‌ లీగ్ ఫైనల్‌లో నీర‌జ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. అత‌డు 87.86 మీట‌ర్ల దూరం ఈటెను విసిరాడు. అయితే.. ఒక్క సెంటీమీట‌ర్ తేడాతో అగ్ర‌స్థానాన్ని కోల్పోయాడు. పీట‌ర్స్ అండ‌ర్స‌న్ 87.87 మీట‌ర్ల దూరం ఈటెను విసిరి ఛాంపియ‌న్‌గా నిలిచాడు.