Yashasvi Jaiswal : కోహ్లీ వల్ల కాలేదు.. యశస్వి జైస్వాల్ అందుకుంటాడా?
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ)లో టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఓ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు.

Yashasvi Jaiswal On Cusp Of WTC History Not Even Virat Kohli Achieved It
Yashasvi Jaiswal – Ajinkya Rahane : ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ)లో టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఓ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో అతడు మరో 132 పరుగులు చేస్తే ఒక డబ్ల్యూటీసీ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన టీమ్ఇండియా ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. 2023-2025 డబ్ల్యూటీసీలో ఇప్పటి వరకు జైస్వాల్ 1028 పరుగులు చేశాడు.
ప్రస్తుతం ఈ రికార్డు అజింక్యా రహానే పేరిట ఉంది. డబ్ల్యూటీసీ 2019-21 సైకిల్‌లో రహానే 1159 పరుగులు చేశాడు. రహానేతో పాటు రోహిత్ శర్మ, జైస్వాల్ లు మాత్రమే ఒక డబ్ల్యూటీసీ ఎడిషన్‌లో వెయ్యి పరుగులు చేసిన భారత ఆటగాళ్లుగా ఉన్నారు. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే ప్రస్తుత టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ 1398 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు.
IND vs BAN : టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ సెషన్‌లో ఎలా కష్టపడుతున్నారో చూశారా.. వీడియో వైరల్
సిక్సర్ల రికార్డు?
యశస్వి జైస్వాల్ మరో ఎనిమిది సిక్సర్లు కొడితే.. ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెక్‌కల్లమ్ (2014లో 33 సిక్సర్ల) పేరిట ఉంది. ఈ జాబితాలో బెన్‌స్టోక్స్ (2022లో 26 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (2024లో 26 సిక్సర్లు)లు ఉన్నాయి. టీమ్ఇండియా ఈ ఏడాది ఇంకో ఎనిమిది టెస్టులు ఆడనుంది. ఈ క్రమంలో ఈ రికార్డును అందుకోవడం అతడికి పెద్ద కష్టం కాకపోవచ్చు.
సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో టీమ్ఇండియా రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 19న తొలి టెస్టు చెన్నై వేదికగా, సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించి డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని భారత్ భావిస్తోంది.