Womens T20 World Cup prize money : ఐసీసీ కీల‌క నిర్ణ‌యం.. 225 శాతం పెరిగిన మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప్రైజ్‌మ‌నీ

అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

Womens T20 World Cup prize money : ఐసీసీ కీల‌క నిర్ణ‌యం.. 225 శాతం పెరిగిన మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప్రైజ్‌మ‌నీ

ICC announces record prize money for Women’s T20 World Cup 2024

Updated On : September 17, 2024 / 4:36 PM IST

Womens T20 World Cup prize money : అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పురుషుల‌తో స‌మానంగా మ‌హిళా టోర్నీల్లోనూ ప్రైజ్‌మ‌నీని అంద‌జేయ‌నుంది. అక్టోబ‌ర్‌లో యూఏఈ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024కు సంబంధించిన ప్రైజ్‌మ‌నీని ప్ర‌క‌టించింది. ఏకంగా 79.58 లక్షల డాలర్లను ప్రైజ్ మనీగా ప్ర‌క‌టించింది. గ‌త ప్ర‌పంచ‌క‌ప్‌తో పోలిస్తే ఏకంగా 225 శాతం అధికం కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ టోర్నీ విజేత‌గా నిలిచిన జ‌ట్టుకు 2.34 మిలియ‌న్ డాల‌ర్లు ల‌భించ‌నుంది. గ‌తంలో విజేత‌కు 1 మిలియ‌న్ డాల‌ర్లు ప్రైజ్‌మ‌నీగా ద‌క్కేది. అంటే ఏకంగా 134 శాతం పెరిగింది. ఇక ర‌న్న‌ర‌ప్ ప్రైజ్‌మ‌నీ కూడా భారీగానే పెరిగింది. 134 శాతం మేర పెరిగింది. 1.17 మిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. సెమీ ఫైన‌ల్‌లో ఓడిన జ‌ట్ల‌కు 6.75 లక్షల డాలర్లు ఇవ్వ‌నుంది. ఇది గ‌తంతో పోలిస్లే మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.

IND vs BAN : బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. రోహిత్ శ‌ర్మ కీల‌క వ్యాఖ్య‌లు..

గ్రూపు ద‌శ‌లోనే నిష్ర్క‌మించినా కూడా ఐసీసీ ప్రైజ్‌మ‌నీ ద‌క్క‌నుంది. ఒక్కొ జ‌ట్టుకు 1,12,500 డాల‌ర్లు చొప్పున అందించ‌నున్నారు. ఇక గ్రూపు ద‌శ‌లో మ్యాచ్ గెలిస్తే.. 31154 డాలర్లు ఇస్తారు. 5 నుంచి 8వ స్థానాల్లో నిలిచే జ‌ట్ల‌కు 2.7 లక్షల డాలర్లు, 9, 10వ స్థానాల్లో ఉన్న వారికి 1.35 లక్షల డాలర్లు అంద‌జేయ‌నున్నారు. మ‌హిళ‌ల క్రికెట్‌కు ఆద‌ర‌ణ పెంచే ఉద్దేశ్యంతో ఐసీసీ ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

యూఏఈ వేదిక‌గా అక్టోబ‌ర్ 3 నుంచి 20 వ‌ర‌కు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 జ‌ర‌గ‌నుంది. అక్టోబ‌ర్ 17, 18 తేదీల్లో సెమీఫైన‌ల్ మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి. అక్టోబర్ 20న ఫైనల్ జ‌ర‌గ‌నుంది.

Yashasvi Jaiswal : కోహ్లీ వ‌ల్ల కాలేదు.. యశస్వి జైస్వాల్ అందుకుంటాడా?

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)