IND vs BAN : బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. రోహిత్ శ‌ర్మ కీల‌క వ్యాఖ్య‌లు..

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు టీమ్ఇండియా పూర్తిగా స‌న్న‌ద్ధ‌మైంది.

IND vs BAN : బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. రోహిత్ శ‌ర్మ కీల‌క వ్యాఖ్య‌లు..

Rohit Sharma Takes Hilarious 'Lene Do Maze' Dig At Bangladesh Ahead Of 1st Test

Updated On : September 17, 2024 / 4:00 PM IST

Rohit Sharma : బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు టీమ్ఇండియా పూర్తిగా స‌న్న‌ద్ధ‌మైంది. సెప్టెంబ‌ర్ 19 నుంచి చెన్నై వేదిక‌గా భార‌త్‌, బంగ్లాదేశ్‌లు తొలి టెస్టు మ్యాచులో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ క్ర‌మంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. టెస్టు సీజ‌న్ కోసం అన్ని విధాలుగా సిద్ధం అయిన‌ట్లు చెప్పుకొచ్చాడు. బంగ్లాదేశ్‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌డం లేద‌ని, డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ నేప‌థ్యంలో ప్ర‌తీ మ్యాచ్ త‌మ‌కు ఎంతో కీల‌కం అని అన్నాడు.

కేఎల్ రాహుల్ క్లాస్ ప్లేయ‌ర్ అని కొనియాడాడు. రీ ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టి నుంచి నిల‌క‌డ‌గా రాణిస్తున్నాడ‌ని అన్నారు. ద‌క్షిణాఫ్రికాలో సెంచ‌రీ చేశాడు. అంతేకాకుండా గాయంతో ఆడిన చివ‌రి టెస్టులోనూ రాహుల్ 80 ప‌రుగులు చేసిన విష‌యాన్ని గుర్తు చేశాడు. అదే ఫామ్‌ను అత‌డు కొన‌సాగిస్తాడ‌ని ఆశిస్తున్న‌ట్లు తెలిపాడు.

Yashasvi Jaiswal : కోహ్లీ వ‌ల్ల కాలేదు.. యశస్వి జైస్వాల్ అందుకుంటాడా?

ఆరు నెల‌ల పాటు టెస్టుల‌కు దూరంగా ఉండ‌డం ప్ర‌భావం చూపుతుంద‌న్నాడు. అయితే.. జ‌ట్టులోకి చాలా మంది ఆట‌గాళ్లు దేశ‌వాళీ టోర్నీలు ఆడ‌డం సానుకూల అంశం అని చెప్పాడు. బంగ్లాదేశ్ త‌మ‌ను ఓడించాల‌ని ఆరాట‌ప‌డుతోంద‌ని, అయితే.. వారి ఆశ నెర‌వేరే ప‌రిస్థితి లేద‌న్నాడు. ఇంగ్లాండ్ కూడా త‌మ‌ను ఓడించాల‌ని అనుకుంద‌ని, అయితే.. ఏం జ‌రిగిందో అంద‌రూ చూశార‌న్నాడు. ఇంగ్లాండ్ సిరీస్‌కు చాలా మంది ఆట‌గాళ్లు గాయాల‌తో దూరం అయ్యార‌ని, ప్ర‌స్తుతం అంద‌రూ జ‌ట్టులో ఉండ‌డం అద‌న‌పు బ‌లం అని తెలిపాడు.

భ‌విష్య‌త్తు కోసం య‌శ‌స్వి జైస్వాల్‌, ధ్రువ్ జురెల్‌, స‌ర్ఫ‌రాజ్ ఖాన్ వంటి ఆట‌గాళ్ల‌ను సిద్ధం చేస్తున్నామ‌ని చెప్పాడు. ఇప్ప‌టికే య‌శ‌స్వి త‌న స‌త్తా ఏంటో ప్ర‌పంచానికి తెలియ‌జేశాడ‌ని తెలిపారు. క‌ఠిన ప‌రిస్థితుల్లోనూ అద్భుతంగా రాణించాడ‌న్నారు. ఇక స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌, ధ్రువ్ జురెల్‌లు నిర్భ‌యంగా ఆడుతున్నార‌ని చెప్పాడు. భారత క్రికెట్‌కు ఇది శుభసూచికం అని రోహిత్ అన్నాడు.
Team India : టీమ్ఇండియా 36 కే ఆలౌట్.. స్పెష‌ల్ డిన్న‌ర్ ఏర్పాటు చేసిన ర‌విశాస్త్రి.. అశ్విన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు