IND vs BAN : ఇదేం పిచ్ రా అయ్యా.. అర్థ‌మైన‌ట్లే ఉంది గానీ.. చెపాక్ పిచ్‌పై బంగ్లాదేశ్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌కు రంగం సిద్ధమైంది.

IND vs BAN : ఇదేం పిచ్ రా అయ్యా.. అర్థ‌మైన‌ట్లే ఉంది గానీ.. చెపాక్ పిచ్‌పై బంగ్లాదేశ్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

Bangladesh Coach Chandika Hathurusingha

Updated On : September 18, 2024 / 3:10 PM IST

India vs Bangladesh : బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌కు రంగం సిద్ధమైంది. గురువారం నుంచి చెన్నై వేదిక‌గా తొలి టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఫేవ‌రేట్‌గా బ‌రిలోకి దిగుతోంది. అయిన‌ప్ప‌టికి పాకిస్థాన్‌ను వాళ్ల సొంత గ‌డ్డ‌పైనే బంగ్లాదేశ్ ఓడించ‌డంతో ఈ మ్యాచ్ పై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. పాకిస్థాన్‌పై విజ‌యం సాధించ‌డంలో బంగ్లా స్పిన్న‌ర్లు కీల‌క పాత్ర పోషించారు.

సాధార‌ణంగా చెన్నై పిచ్ స్పిన్‌కు అనుకూలం అన్న సంగ‌తి తెలిసిందే. పిచ్ నుంచి స్పిన్న‌ర్ల‌కు స‌హ‌కారం ల‌భిస్తే బంగ్లా స్పిన్న‌ర్లు చెల‌రేగ‌డం ఖాయం. ఈ క్ర‌మంలో చెపాక్ పిచ్ ఎలా ఉండ‌నుందోన‌నే ఆస‌క్తి మొద‌లైంది. ఇదే స‌మ‌యంలో చెపాక్ పిచ్ గురించి బంగ్లాదేశ్ ప్ర‌ధాన కోచ్ చండికా హతురుసింఘా కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.

Rohit Sharma : రాహుల్ ద్ర‌విడ్‌, గౌత‌మ్ గంభీర్‌ల కోచింగ్‌ తీరుపై రోహిత్ శ‌ర్మ కామెంట్స్‌..

స్పోర్టింగ్ వికెట్ లా క‌నిపిస్తోంద‌న్నారు. ఎప్ప‌టి నుంచి బంతి తిరుగుతుంద‌నే విష‌యం మాత్రం త‌న‌కు అర్థం కావ‌డం లేద‌న్నాడు. ఉప‌ఖండంలో ప‌రిస్థితులు త్వ‌ర‌గా మారిపోతాయ‌న్నాడు. ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ జ‌ట్టు అయిన టీమ్ఇండియాతో త‌ల‌ప‌డ‌డం త‌మ‌కు క‌ఠిన స‌వాల్ అని చెప్పుకొచ్చాడు. పాక్‌తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయ‌డంతో ఆట‌గాళ్ల‌లో ఆత్మ విశ్వాసం నింపిందని తెలిపాడు. త‌మ జ‌ట్టు స‌మ‌తూకంగా ఉంద‌న్నాడు. పేస్‌, స్పిన్‌తో పాటు బ్యాటింగ్ విభాగం ప‌టిష్టంగా ఉంద‌న్నాడు.

క్యూరేట‌ర్ ఏమ‌న్నాడంటే..?
గ‌త రెండు వారాలుగా చెన్నైలోని వాతావ‌ర‌ణం వేడిగా ఉంద‌న్నాడు. ఉష్ణోగ్రత 30 డిగ్రీల‌కు పైనే న‌మోదు అవుతోంది. దీంతో పిచ్‌కు నీళ్లు ప‌డుతున్నాము. మ్యాచ్ సాగే కొద్ది పిచ్ స్పిన్న‌ర్ల‌కు అనుకూలంగా మారుతుంది. బ్యాట‌ర్ల స‌వాల్ విసిరే అవ‌కాశం ఉంది. అని చెప్పాడు.

IND vs BAN : భార‌త్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌.. ఫ్రీగా మ్యాచుల‌ను ఎక్క‌డ‌ చూడొచ్చొ తెలుసా?