×
Ad

Pakistan : పాకిస్థాన్‌ జట్టుకు సెమీఫైనల్‌లోకి వెళ్లే ఛాన్స్ ఇంకా ఉందా? ఇలా జరిగితే ఛాన్స్ ఉంటుంది..

Pakistan : గ్రూప్ -2 నుంచి ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు సెమీ ఫైనల్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. మరో బెర్త్ కోసం శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు పోటీ పడుతున్నాయి.

T20 World Cup 2026

  • గ్రూప్-2 నుంచి సెమీఫైనల్‌లోకి వెళ్లిన ఇంగ్లాండ్
  • సెమీస్‌లో మరో బెర్త్‌కోసం మూడు జట్లు పోటీ
  • పాకిస్థాన్ జట్టుకూ సెమీస్‌కు ఛాన్స్

Pakistan : టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా సూపర్-8లో జట్ల మధ్య మ్యాచ్ లు రసవత్తరంగా మారుతున్నాయి. సెమీస్ కు ఏఏ జట్లు వెళ్తాయని క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. గ్రూప్ -2 నుంచి ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు సెమీ ఫైనల్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. మరో బెర్త్ కోసం శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు పోటీ పడుతున్నాయి.

Also Read : T20 worldCup 2026 : టీమిండియాకు బిగ్‌షాక్.. కీలక మ్యాచ్ సమయంలో జట్టును వీడిన విధ్వంసకర బ్యాటర్

పాకిస్థాన్ జట్టు సూపర్-8లో మొత్తం రెండు మ్యాచ్ లు ఆడింది. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ డ్రా కాగా.. ఒక పాయింట్ వచ్చింది. మంగళవారం రాత్రి ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. పాకిస్థాన్ సెమీఫైనల్ అవకాశాలు దాదాపు కోల్పోయినట్లే. అయితే, పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే శ్రీలంక జట్టుపై ఆధారపడి ఉంది.

శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్థాన్ మూడు జట్లు సెమీఫైనల్‌కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. 25న శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించాలి. శుక్రవారం ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయి.. అదే సమయంలో.. 28వ తేదీన జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు శ్రీలంక జట్టుపై విజయం సాధించాల్సి ఉంటుంది. అలా జరిగితే పాకిస్థాన్ మూడు పాయింట్లతో రెండో స్థానంలోకి దూసుకెళ్తుంది. దీంతో పాకిస్థాన్ సెమీస్ కు చేరే అవకాశం వస్తుంది. కానీ, ఒకవేళ పాకిస్థాన్ ఓడిపోతే శ్రీలంక సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

బుధవారం జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు శ్రీలంకను ఓడిస్తే ఆ జట్టు సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకుంటుంది. అదే సమయంలో ఇంగ్లాండ్ జట్టుపైనా విజయం సాధిస్తే సెమీఫైనల్లోకి దూసుకెళ్తుంది. కానీ, శ్రీలంకపై గెలిచి.. ఇంగ్లాండ్ జట్టుపై ఓడిపోతే.. న్యూజిలాండ్ జట్టు మూడు పాయింట్లతో ఉంటుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ జట్టు శ్రీలంకపై జరిగే మ్యాచ్‌లో భారీ ఆధిక్యంతో విజయం సాధించాలి.. తద్వారా రన్‌రేట్ ఆధారంగా పాకిస్థాన్ సెమీస్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉంటుంది.

సూపర్ 8 గ్రూప్-2లో మిగిలిన మ్యాచ్‌లు..
♦ ఫిబ్రవరి 25: కొలంబోలో శ్రీలంక vs న్యూజిలాండ్
♦ ఫిబ్రవరి 27: కొలంబోలో ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్
♦ ఫిబ్రవరి 28: పల్లెకెలెలో శ్రీలంక vs పాకిస్తాన్