Cash and valuables stolen from Former Cricketer Azharuddin Lonavala Bungalow
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ మాజీ భార్య సంగీత బిజ్లానీకి చెందిన బంగ్లాలో దొంగతనం జరిగింది. పుణె జిల్లా మావల్ తాలూకాలోని టికోణా పేట్ ప్రాంతంలో ఉన్న ఈ బంగ్లాలో మార్చి 7 నుంచి జూలై 18 మధ్య ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు బంగ్లా వెనుక ఉన్న కాంపౌండ్ గోడ పై ఉన్న వైర్ మెష్‌ను కట్ చేసి లోనికి ప్రవేశించారు. బంగ్లా మొదటి అంతస్తు గ్యాలరీలోకి ఎక్కి అక్కడ ఉన్న కిటికి గ్రిల్ ను బలవంతంగా తెరిచి ఇంట్లోకి చొరబడ్డారు.
ENG vs IND : వీళ్లు డగౌట్‌కే పరిమితమా..? నీళ్ల బాటిళ్లు అందిస్తూనే ఉండాలా?
ఇంట్లో ఉన్న రూ.50 వేల నగదుతో పాటు సుమారు 7 వేల విలువ చేసే టీవీ సెట్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. మొత్తం రూ.57 వేల నష్టం వాటిల్లింది. అంతేకాకుండా దొంగలు ఇంట్లో ఉన్న వస్తువులకు కూడా నష్టం కలిగించినట్లు తెలుస్తోంది.
దీనిపై వ్యక్తిగత సహాయకుడు 54 ఏళ్ల మహ్మద్ ముజీబ్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మార్చి 7 నుంచి జూలై 18 మధ్య బంగ్లాలో ఎవరు లేని సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలిపాడు. లోనావాలా గ్రామీణ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై BNS సెక్షన్లు 331(3), 331(4), 305(a), 324(4), 324(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.