ఛాంపియన్లు తొందరగా ముగించరు…ధోనీ కెరీర్ పై గంగూలీ

బుధవారం(అక్టోబర్-23,2019)బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముంబైలో గంగూలీ మీడియాతో మాట్లాడారు. నిబంధన 38(ఆసక్తి సంఘర్షణ గురించిన బీసీసీఐ నియమం) మారాలని గంగూలీ అన్నారు. ఇది ఇప్పటికే CoA చేత చేయబడిందని, ఈ రోజు కార్యాలయాన్ని ఖాళీ చేసిన నిర్వాహకులు దీనిని ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉంచారని, కాబట్టి, ఇది ఎంతవరకు సవరించబడుతుందో చూడాలని అన్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో రేపు ఉదయం మాట్లాడతానని గంగూలీ అన్నారు. భారత క్రికెట్ లో కోహ్లీ ఒక ముఖ్యమైన వ్యక్తి అన్నారు. అన్ని విధాలుగా కోహ్లీని సపోర్ట్ చేస్తామన్నారు. 

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ భవిష్యత్తు గురించి గంగూలీ మాట్లాడుతూ…అది అతని మీద ఆధారపడి ఉంటుంది. నేను టీమిండియా నుంచి బయటికెళ్లిపోయినప్పుుడు ప్రపంచమంతా నేను మళ్లీ ఫామ్ లోకి రాలేనన్నారు. నేను తిరిగివచ్చి 4సంవత్సరాలు ఆడాను. ఛాంపియన్లు తొందరగా ముగించరు అని గంగూలీ అన్నారు. ధోని మనసులో ఏముందో, కెరీర్ గురించి అతడు ఏం ఆలోచిస్తున్నాడో తనకు తెలియదన్నారు. ధోని ఒక గొప్ప ఆటగాడన్నారు. ధోనిని చూసి దేశం గర్వపడుతోందన్నారు. ధోని ఏం చేశాడు అని కూర్చొని ఓ పేపర్ మీద రాయడం మెదలుపెడితే మీరు అద్భుతం అని అంటారని,తాను పదవిలో ఉన్నంతకాలం అందరూ గౌరవించబడతారని,అది ఎప్పటికీ మారదని గంగూలీ అన్నారు.

క్రెడిబులిటీ విషయంలో కాంప్రమైజ్ అవనని  గంగూలీ తెలిపారు. తాను టీమిండియాను లీడ్ చేసిన విధంగానే..ఎలాంటి అవినీతిని దరికి చేరనివ్వనని,అదే విధంగా బీసీసీఐని కూడా అవినీతిరహితంగా ఉంచుతామని గంగూలీ తెలిపారు. ఈ రోజు అధ్యక్ష బాధ్యతలు చేపట్టే సందర్భంగా తాను ధరించిన కోటు(బ్లేజర్)టీమిండియా కెప్టెన్ గా ఉన్న సమయంలో తన దగ్గర ఉన్నదని,కోటు చాలా లూస్ అయిన సంగతి తాను గమనించలేదన్నారు.