Champions Trophy: వర్షం వల్ల అఫ్ఘాన్‌తో మ్యాచు రద్దు.. ఆస్ట్రేలియా సెమీస్‌ బెర్త్ ఖరారు.. నెక్స్ట్‌ ఏంటంటే?

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్‌ 50 ఓవర్లలో 273 పరుగులు చేసింది.

Pic: @ICC

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా లాహోర్‌లో జరగాల్సిన అఫ్ఘానిస్థాన్, ఆస్ట్రేలియా మ్యాచుకు వరుణుడు అడ్డంకి కలిగించాడు. ఆస్ట్రేలియా ఒక వికెట్ నష్టానికి 109 పరుగులు (12.5 ఓవర్లలో) చేసిన సమయంలో వర్షం కురిసి వెలియలేదు.

దీంతో చివరకు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఆస్ట్రేలియా నాలుగు పాయింట్లతో సెమీస్‌ బెర్త్ ఖరారు చేసుకుంది. అఫ్ఘానిస్థాన్ మూడు పాయింట్లతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్‌ 50 ఓవర్లలో 273 పరుగులు చేసింది. అఫ్ఘాన్ బ్యాటర్లలో అటల్ 85, అజ్మతుల్లా 67 పరుగులతో రాణించారు.

అనంతరం 274 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించింది ఆస్ట్రేలియా. మ్యాథ్యూ 20, ట్రావిస్ హెడ్ 59 (నాటౌట్), స్టీవ్ స్మిత్ 19 (నాటౌట్) పరుగులు చేశారు. అనంతరం వర్షం పడడంతో మ్యాచ్‌ రద్దు అయింది.

Champions Trophy: కోహ్లీ 300వ వన్డేపై న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ ఆసక్తికర కామెంట్స్‌.. భారత్‌, న్యూజిలాండ్‌ వన్డేపై ఏమన్నాడో తెలుసా?

రేపు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఇది గ్రూప్‌ బీలో చివరి మ్యాచు. ఎల్లుండి న్యూజిలాండ్‌, ఇండియా మ్యాచ్ ఉంది. ఈ మ్యాచులు ముగిస్తే సెమీఫైనల్‌లో ఏయే జట్టు ఏయే జట్టుతో తలపడతాయో తేలిపోతుంది.

ఆస్ట్రేలియా జట్టు: మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవ్‌ స్మిత్, లబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కెరీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, బెన్ డ్వారషూస్‌, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్

అఫ్ఘానిస్థాన్ జట్టు: రెహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్‌ హక్ ఫారూఖీ