Champions Trophy 2025 Shami knocks over Kohli middle stump during net session ahead of New Zealand clash
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో సెమీస్‌కు చేరుకుంది. గ్రూప్ స్టేజీలో చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఆదివారం భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్-ఏలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంటుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి అగ్రస్థానంతో సెమీస్‌లో అడుగుపెట్టాలని ఇటు భారత్, అటు న్యూజిలాండ్ ఆరాటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి.
టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలోభారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో షమీ బౌలింగ్‌ను ఆడడంలో విరాట్ కోహ్లీ తడబడ్డాడు. షమీ విసిరిన బంతిని భారీ షాట్ కొట్టాలని కోహ్లీ భావించగా.. బంతి బ్యాట్, ప్యాడ్ల మధ్య ఉన్న ఖాళీలోంచి వెళ్లి మిడిల్ స్టంప్‌ను తాకింది.
Hitman on fire! 🥵🔥 Kohli bowled by Shami 😭⚡ #INDvsNZ
— Over and out (@Over_and_out1) March 1, 2025
ఇక పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన కెప్టెన్ రోహిత్ శర్మ నెట్ సెషన్‌లో పుల్ షాట్‌తో సహా తనదైన శైలిలో షాట్లు ఆడుతూ కాస్త సౌకర్యవంతంగానే కనిపించాడు.
కోహ్లీకి 300వ మ్యాచ్..
కాగా.. విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్ ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోనుంది. కోహ్లీ కెరీర్‌లో ఇది 300వ వన్డే మ్యాచ్. ఇప్పటి వరకు కోహ్లీ 299 వన్డేల్లో 58.2 సగటుతో 14085 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు, 73 అర్థశతకాలు ఉన్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీలో శతకంతో కోహ్లీ సూపర్ ఫామ్‌లోకి వచ్చాడు. ఇక తన కెరీర్ మైలుస్టోన్ లాంటి మ్యాచ్‌లోనూ సెంచరీతో చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు.