Sunil Gavaskar : సెమీస్ రేసు నుంచి ఇంగ్లాండ్ ఔట్.. భారత్ పై ఇంగ్లాండ్ మాజీల అక్కసు.. తీవ్ర అసహనం వ్యక్తం చేసిన గవాస్కర్..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇంగ్లాండ్ కథ ముగిసింది.

Champions Trophy 2025 Sunil Gavaskar storng counter to former England captains
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇంగ్లాండ్ కథ ముగిసింది. గ్రూప్ సేజ్టీలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆ జట్టు ఇంటి ముఖం పట్టింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో ఇంగ్లాండ్ సెమీస్‌కు చేరకుండానే నిష్ర్కమించింది. దీంతో ఆ జట్టు మాజీ ఆటగాళ్లు ఆ కోపాన్ని, బాధను టీమ్ఇండియా పై అక్కసు రూపంలో వెళ్లగక్కుతున్నారు. ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు నాసర్ హుస్సేన్, మైఖేల్ అథర్టన్ లు చేసిన వ్యాఖ్యలపై టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించారు. గట్టి కౌంటర్ ఇచ్చాడు.
భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్‌కు జట్టును పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. దీంతో భారత్ ఆడే మ్యాచ్ లు అన్ని దుబాయ్ వేదికగానే నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ఐసీసీ టోర్నీకి ముందే స్పష్టం చేసింది. అయినప్పటికి ఇంగ్లాండ్ మాజీలు మాత్రం ఒకే వేదిక పై ఆడడం భారత్‌కు ఎంతో ప్రమోజనం అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ తప్పుబట్టాడు.
పక్క టీమ్‌ల వీద ఇలాంటి కామెంట్లు చేసే బదులు, మీ సొంత జట్టు బలహీనతలపై దృష్టి పెడితే చాలా బాగుంటుందని హితవు పలికాడు. వీరందరూ ఎంతో తెలివైన వారు, అనుభవజ్ఞులు అని నేను అనుకుంటున్నాను. మీరంతా మీ జట్టు ఎందుకు సెమీస్ అర్హత సాధించలేదో ఆ విషయం దృష్టి పెట్టండి. మీ జట్టు ఓటమిని జీర్ణించుకోలేని స్థితిలో మానస్థిక స్థితిలో మీరు ఉన్నట్లుగా అనిపిస్తోంది. సరైన ఫలితాల కోసం ఏం చేయాలి అనే దానిపై దృష్టి పెడితే మంచిది. అంతేకానీ వేరే జట్ల పై నిందలు వేయడం తగదు అని సునీల్ గవాస్కర్ అన్నాడు.
భారత్‌కు అలాంటి అవకాశం వచ్చింది. అంతేకానీ మాకు రాలేదు అని ఎవరూ బాధపడనవసం లేదు అని గవాస్కర్ సూచించాడు. వారంతా దృష్టి పెట్టాల్సిన అంశాలు చాలానే ఉన్నాయని చెప్పుకొచ్చాడు.
ఈ విషయం గురించి తాను ఇంతకముందు చెప్పానని, అయినప్పటికి వాళ్లు మళ్లీ, మళ్లీ అలాంటి కామెంట్లే చేస్తున్నట్లుగా వివరించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ సేవలు అద్భుతం. నాణ్యత, ఆదాయం, ప్రతిభ ఎలా చూసుకున్నా కూడా భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇక టెవివిజన్ హక్కులు. మీడియా ఆదాయం ద్వారా భారీగా ఆదాయం వస్తోంది. వారికి (ఇంగ్లాండ్ మాజీలు)అందుతున్న జీతాలు కూడా పరోక్షంగా భారత్ వల్లేనన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి అని గవాస్కర్ చెప్పారు.