Champions Trophy 2025 : ‘అన్నా ఫ్లీజ్ సాయం చేయండి.. మీ మేలు మరిచిపోం..’ జోస్ బట్లర్‌ను వేడుకుంటున్న అఫ్గానిస్థాన్ కెప్టెన్.. ‘మీరే దిక్కు..’
ఇంగ్లాండ్‌కు అఫ్గానిస్థాన్ కెప్టెన్ ఓ విజ్ఞప్తి చేశాడు.

Champions Trophy 2025 Afghanistan captain Hashmatullah Shahidi big appeal to England ahead of South Africa calsh
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శనివారం దక్షిణాఫ్రికాతో ఇంగ్లాండ్ తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ జట్లు కెప్టెన్ జోస్ బట్లర్‌తో పాటు ఆ జట్టు ఆటగాళ్లను సాయం చేయాల్సిందిగా అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది వేడుకుంటున్నాడు. దక్షిణాఫ్రికాను చిత్తు చిత్తుగా ఓడించాలని ఇంగ్లాండ్‌ను కోరుతున్నాడు.
ఎందుకంటే..?
శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ చివరికి వర్షం కారణంగా రద్దు కావడంతో అఫ్గానిస్థాన్ సెమీస్ అవకాశాలు దాదాపుగా గల్లంతు అయ్యాయి. అయితే.. నేడు దక్షిణాఫ్రికాతో పై ఇంగ్లాండ్ అసాధారణ విజయాన్ని సాధిస్తే మాత్రం అఫ్గానిస్థాన్‌కు సెమీస్ చేరే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే హష్మతుల్లా షాహిది ఇంగ్లాండ్ ఆటగాళ్లను భారీ తేడాతో గెలవాల్సిందిగా సూచించాడు.
‘దురదృష్టవశాత్తు ఫలితం రాకుండానే మ్యాచ్ రద్దు అయిపోయింది. ఇది గొప్ప గేమ్. 300 పైగా స్కోరు చేస్తామని అనుకున్నాము. అయితే.. ఆసీస్ బౌలర్లు మిడిల్ ఓవర్లలో బంతి బంతులు వేసి మమ్మిల్ని కట్టడి చేశారు. ఈ పిచ్ పై 270 పరుగులు కూడా మంచి స్కోరే. అయితే.. బౌలింగ్‌లో మేము తడబడ్డాము. ఈ మ్యాచ్‌లో చేసిన తప్పిదాల నుంచి నేర్చుకుని ముందుకు సాగుతాం.’ అని అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది ఆస్ట్రేలియాతో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయిన అనంతరం మాట్లాడుతూ చెప్పాడు.
అటల్ చాలా బాగా ఆడాడని అతడికి ఇదే తొలి ఐసీసీ టోర్నీ అని చెప్పుకొచ్చాడు. ఒత్తిడిలోనూ ఎంతో గొప్పగా రాణించాడని తెలిపాడు. ఇక ఒమర్జాయ్ టాప్ క్లాస్ ప్లేయర్. జట్టు కోసం ఆడతాడని, అందుకనే అతడికి వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిందన్నాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో తమ కథ ముగిసిపోలేదని తెలిపాడు. తమకు ఇంకా అవకాశాలు మిగిలి ఉన్నాయని పేర్కొన్నాడు.
దక్షిణాఫ్రికా పై ఇంగ్లాండ్ భారీ విజయం సాధిస్తే అప్పుడు మాకు ఛాన్స్ ఉంది. ఈ ఆటలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు అని షాహిది తెలిపాడు.
భారం మొత్తం ఇంగ్లాండ్ పైనే..
గ్రూప్-ఏ నుంచి ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. వర్షం కారణంగా అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ఆస్ట్రేలియా గ్రూప్-బి నుంచి సెమీస్ చేరుకుంది. గ్రూప్-బి నుంచి మరో స్థానం కోసం అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య పోటీ ఉంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ ఖాతాల్లో చెరో మూడు పాయింట్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికా నెట్ రన్ రేటు (+2.140) అఫ్గానిస్థాన్ (-0.990) కంటే ఎక్కువగా ఉంది. దీంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.
గ్రూప్ దశలో అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లు అన్ని పూర్తి అయ్యాయి. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచే గ్రూప్-బిలో ఆఖరి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో దక్షిణాప్రికా గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్‌కు చేరుకుంటుంది. ఓడినా కూడా తక్కువ తేడాతో ఓడితే నెట్ రన్‌రేట్ ఆధారంగా సెమీస్‌కు వెలుతుంది. అయితే.. చిత్తు చిత్తుగా ఓడకుంటే చాలు. ప్రస్తుతం ఆ జట్టు ఆడుతున్న తీరు చూస్తుంటే ఈజీగా సఫారీలు సెమీస్‌కు వెళ్లే అవకాశం ఉంది.