సూపర్ కింగ్స్ మొదటిసారి భయపడింది: ఫ్లెమింగ్

చెన్నై సూపర్ కింగ్స్ తొలిసారి భయానికి గురైందని సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్ అంటున్నాడు. ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడుతూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో 6 వికెట్ల తేడాతో జరిగిన మ్యాచ్ వైఫల్యం గురించి చర్చించాడు. లీగ్ ఆరంభమైనప్పటి నుంచి చెన్నై జట్టుకిది రెండో ఓటమి.

‘చెన్నై జట్టు తొలిసారి ఆందోళనకు గురైంది. తొలి 10 ఓవర్లు బాగానే ఆడాం. చివర్లో కలిసి రాలేదు. వికెట్లు వెంటవెంటనే పడిపోవడంతో భారీ టార్గెట్ నమోదు చేయలేకపోయాం. హైదరాబాద్ బౌలర్లు చక్కటి ఆట కనబరిచారు. ఓటముల గురించి అతిగా చర్చించడానికి ఏమీ లేదు. ఎక్కడైతే ఇంకా ఆటను మెరుగుపరుచుకోవలసి ఉందో ఆలోచిస్తాం’

‘గత మ్యాచ్ అనంతరం కూడా ధోనీ ఫిట్ గానే ఉన్నాడు. కానీ, ముందుజాగ్రత్తగా విశ్రాంతి తీసుకున్నాడు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటేనే సీజన్ మొత్తం చక్కగా ఆఢగలం. ఆడిన 8 మ్యాచ్‌లకు ఏడింటిలో విజయం సాధించాం. తొమ్మిదో మ్యాచ్ మాత్రమే ఓడిపోయాం. తర్వాత ఆడాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీతో తలపడాల్సి ఉంది. ఇప్పుడే సెమీ ఫైనల్‌కు వెళ్లిపోయామనుకోవడం లేదు. ఎందుకంటే ప్రతి మ్యాచ్ టఫ్‌గానే ఉంటుంది. ఈ సారి గేమ్‌లో బ్యాటింగ్‍‌పై దృష్టి సారించాం. ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదనుకుంటున్నాం’ అని కోచ్ ఫ్లెమింగ్ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.