CSK : చెన్నై కొత్త స్పాన్స‌ర్‌ను చూశారా?

ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు ముందు చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు కొత్త స్పాన్స‌ర్ వ‌చ్చింది.

Chennai Super Kings Have A New Sponsor For IPL 2024

Chennai Super Kings : ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు ముందు చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు కొత్త స్పాన్స‌ర్ వ‌చ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ విమానయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్‌వేస్ సీఎస్‌కేతో ఒప్పందాన్ని చేసుకుంది. చెన్నైలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఈ భాగ‌స్వామ్యానికి సంబంధించిన జెర్సీని ఆవిష్క‌రించారు.

కెప్టెన్ ఎంఎస్ ధోనీ 7వ నంబ‌ర్ జెర్సీని విడుద‌ల చేశారు. కాగా.. ఈ ఈవెంట్‌లో ధోని భాగం కాలేదు. ప‌లువురు సీఎస్‌కే ఆట‌గాళ్లు జెర్సీల‌ను వేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Viral Video : బ్యాట‌ర్ ఏదో క‌నిక‌ట్టు చేసిన‌ట్లు ఉన్నాడుగా..!

ఇదిలా ఉంటే.. మ‌రో నెల రోజుల్లో ఐపీఎల్ 2024 సీజ‌న్ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే మ‌హేంద్ర సింగ్ ధోని ప్రాక్టీస్‌ను మొద‌లు పెట్టాడు. ఇదే అత‌డి ఆఖ‌రి సీజ‌న్ అంటూ గ‌త రెండు, మూడేళ్లుగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ ధోని దీనిపై పెద్ద‌గా స్పందించ‌లేదు. ఐపీఎల్ 2023లో సీఎస్‌కేను విజేత‌గా నిలిపిన ధోని ముంబై ఇండియ‌న్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌తో స‌మానంగా ఐదు సార్లు క‌ప్పును అందుకున్నాడు. ఈ ఏడాది కూడా చెన్నై విజేత‌గా నిలిస్తే.. అత్య‌ధిక సార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందుకున్న కెప్టెన్‌గా ధోని నిలుస్తాడు.

Viral Video : ఇన్నాళ్లు ఎక్కడున్నావ‌య్యా.. ఇన్ని వేరియేషన్స్‌.. ఇలా బౌలింగ్‌ చేస్తే ప్ర‌పంచ‌క‌ప్‌లు అన్నీ మ‌న‌వే?

ట్రెండింగ్ వార్తలు