IND W vs BAN W : ఆసియాకప్‌లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ సెమీస్ నేడే.. ఎక్కడ చూడొచ్చంటే?
మహిళల ఆసియాకప్ 2026లో నేడు భారత్, బంగ్లాదేశ్ జట్లు (IND W vs BAN W) సెమీస్‌లో తలపడనున్నాయి.
Womens Asia Cup 2026 India vs Bangladesh semis match today
IND W vs BAN W : మహిళల ఆసియా కప్ 2026లో సెమీ ఫైనల్ మ్యాచ్‌లకు తెరలేచింది. నేడు తొలి సెమీస్‌లో భారత్, బంగ్లాదేశ్‌లు తలపడనున్నాయి. దుబాయ్‌లోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. వరుసగా మూడు మ్యాచ్‌లను గెలిచి భారత్ సెమీస్‌కు చేరుకోగా.. మరోవైపు బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌లు ఆడగా రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఓ మ్యాచ్‌లో ఓడిపోయింది.
బలాబలాల పరంగా చూసుంటే హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సాధారణంగా దుబాయ్ పిచ్ స్పిన్‌కు అనుకూలం. భారత బ్యాటర్లను పరీక్ష పెట్టగల స్పిన్ బలం బంగ్లాదేశ్‌కు కూడా ఉండడంతో బ్యాటింగ్‌లో నిలకడలేమీతో ఇబ్బంది టీమ్ఇండియా జాగ్రత్తగా ఆడాల్సిందే.
తెలుగు అమ్మాయి శ్రీచరణితో పాటు దీప్తి శర్మ, ప్రేమ రావత్ స్పిన్ త్రయం గ్రూప్ దశలో ప్రత్యర్థులను చుట్టేశారు. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఈ ముగ్గురు 20 వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు పార్ట్ టైమ్ స్పిన్నర్ షషాలీ వర్మ సైతం వికెట్లు తీస్తుండడం శుభపరిణామం. భారత స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనడం నిగర్ సుల్తానే నేతృత్వంలోనే బంగ్లాదేశ్ కు శక్తికి మించిన పనే. అటు క్రాంతి గౌడ్, నందని శర్మలతో కూడిన టీమ్ఇండియా పేస్ విభాగం నిలకడగా రాణిస్తోంది.
నిలకడలేమీ బ్యాటర్లు..
భారత జట్టును ఇబ్బంది పెడుతున్న ఏకైక అంశం బ్యాటర్ల నిలకడలేమీ. షపాలీ వర్మ, స్మృతి మందాన ఒక్కొ మ్యాచ్‌లో మెరుపులు మెరిపించారు. ప్రతీకా రావల్, హర్మన్ ప్రీత్ కౌర్, రిచా ఘోష్‌లు ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. సెమీస్‌లో బ్యాటర్లు సమిష్టిగా సత్తా చాటి భారీ స్కోరు సాధించిన అవసరం ఎంతైనా ఉంది.
హెడ్-టు-హెడ్ …
భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్లు ఇప్పటి వరకు 24 టీ20 మ్యాచ్‌ల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో భారత జట్టు 21 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఓ మూడు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ గెలుపొందింది.
ఎక్కడ చూడొచ్చంటే?
భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సోనీ స్పోర్ట్స్‌లో మ్యాచ్‌ను వీక్షించవచ్చు.
