Womens Asia Cup 2026 : మహిళల ఆసియా కప్‌లో ఫైనల్ చేరిన భారత్.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కీలక వ్యాఖ్యలు..
మహిళల ఆసియా కప్ 2026లో (Womens Asia Cup 2026) భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది.
Harmanpreet Kaur Comments after india beat Bangladesh in Womens Asia Cup 2026 semis
Womens Asia Cup 2026 : మహిళల ఆసియా కప్ 2026లో భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమ్ఇండియా 40 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఓపెనర్ షఫాలీ వర్మ (64; 40 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా ప్రతీకా రావల్ (20), రిచా ఘోష్ (21), హర్మన్ ప్రీత్ కౌర్ (24 నాటౌట్) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో సుల్తానా రెండు వికెట్లు తీసింది. మారుఫా, నహీదా, రబేయా తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం 150 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులకే పరిమితమైంది. బంగ్లా బ్యాటర్లలో షోర్నా అక్తర్ (22 నాటౌట్) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టింది. నందని శర్మ రెండు వికెట్లు తీయగా శ్రీ చరణి, ప్రేమ రావత్ చెరో వికెట్ సాధించింది.
Marching into the Final! 🇮🇳
A dominant display by #TeamIndia as they win by 4️⃣0️⃣ runs to seal their spot in the Final of the #WomensAsiaCup 🥳
Scorecard ▶️ https://t.co/6OyMx9q1ih#INDvBAN pic.twitter.com/MtVYlVDv8n
— BCCI Women (@BCCIWomen) September 10, 2026
సెమీస్‌లో బంగ్లాపై విజయం సాధించి ఫైనల్ చేరుకోవడంపై భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఆనందాన్ని వ్యక్తం చేసింది. మ్యాచ్ అనంతరం ఆమె మాట్లాడుతూ.. వరుసగా విజయాలు సాధిస్తుండడంతో చాలా సంతోషంగా ఉంది. మా బ్యాటర్లు, బౌలర్లు రాణిస్తున్న తీరు పట్ల ఆనందంగా ఉంది. మంచి బంతులకు వికెట్లు లభించాయి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లలోని స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. దీంతో బ్యాటర్లు పరుగులు సాధించేందుకు ఇబ్బందులు పడ్డారు. పిచ్ స్పిన్‌కు సహకరించడంతో బౌలర్లు చాలా చక్కగా ఉపయోగించుకున్నారు. అని హర్మన్ అంది.
భారత ఇన్నింగ్స్ సమయంలో రిచా ఘోష్, దీప్తి శర్మల సహకారాన్ని ప్రస్తావిస్తూ.. ఇలాంటి మ్యాచ్‌ల్లో చిన్న చిన్న భాగస్వామ్యాలు కూడా ప్రభావాన్ని చూపిస్తాయని తెలిపింది. ఇన్నింగ్స్ ఆఖరిలో రిచా ఘోష్ బ్యాటింగ్ చేసిన విధానం బాగుందని, ఆమె కొన్ని చక్కని షాట్లు ఆడిందని తెలిపింది. ఇక బౌలింగ్ విషయానికొస్తే దీప్తి శర్మపై ప్రశంసల వర్షం కురిపించింది. తమకు వికెట్ అవసరమైన ప్రతిసారి ఆమె వికెట్ తీసిందని పేర్కొంది.
