CSK Win (PHOTO @IPL Twitter)
IPL 2023: చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) సాధించింది. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన రెండో జట్టుగా నిలిచింది. కీలక పోరులో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)పై 77 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్(86; 58 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల) ఒక్కడే అర్ధశతకంతో ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన వారిలో పృథ్వీ షా(5), ఫిల్ సాల్ట్(3), రిలీ రూసో(0), అక్షర్ పటేల్(13)లు విఫలం అయ్యారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ మూడు వికెట్లు తీయగా, మతీష పతిరన, మహేశ్ తీక్షణ చెరో రెండు, తుషార్ దేశ్ పాండే, రవీంద్ర జడేజాలు ఒక్కొ వికెట్ పడగొట్టారు.
IPL 2023: ఢిల్లీ పై చెన్నై ఘన విజయం
అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే (87; 52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్(79; 50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించగా, ఆఖర్లో శివమ్ దూబే(22; 9 బంతుల్లో 3సిక్సర్లు), రవీంద్ర జడేజా(20 నాటౌట్; 5 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్) దూకుడుగా ఆడారు. ఢిల్లీ బౌలరల్లో చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్జే తలా ఓ వికెట్ పడగొట్టారు.