IPL 2023: సన్‌రైజర్స్‌తో ఉమ్రాన్ మాలిక్ గొడవ పడ్డాడా..? అందుకే తుది జట్టులో స్థానం దక్కడం లేదా..?
సన్‌రైజర్స్ కెప్టెన్ మార్‌క్రమ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారాయి. కెప్టెన్‌కే ఏం జరుగుతుందో తెలియదు అంటే ప్రాంఛైజీలో ఏదో సమస్య ఉందని కొందరు అంటున్నారు. ఈ విషయంపై టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) స్పందించాడు.

Umran Malik-Virender Sehwag
Virender Sehwag-Umran Malik: ఉమ్రాన్ మాలిక్(Umran Malik).. గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad ) తరుపున ఐపీఎల్(IPL)లో ఆడి తన సంచలన ప్రదర్శనతో టీమ్ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. నిలకడగా 150 కి.మీలకు పైగా వేగంతో బంతులు సంధించే ఈ ఆటగాడు భవిష్యత్తులో టీమ్ఇండియా(Team India) తురుపు ముక్కగా మారుతాడని పలువురు మాజీలు అన్నారు. అయితే.. ఎంత వేగంగా భారత జట్టులో చోటు దక్కించుకున్నాడో అంతే వేగంగా చోటు కోల్పోయాడు.
దీంతో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో రాణించి మరోసారి భారత జట్టులో చోటు దక్కించుకుంటాడని అంతా భావించారు. అయితే.. ఈ సారి ఐపీఎల్‌లో అతడికి తుది జట్టులో చోటు మాత్రం దక్కడం లేదు. ఏడు మ్యాచుల్లో మాత్రమే ఆడే అవకాశం లభించగా 5 వికెట్లు తీశాడు. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్ ప్రస్తుతం పరువు కోసం ఆడుతోంది.
నాకేం తెలియదు : మార్‌క్రమ్
గురువారం బెంగళూరు జట్టుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడింది. ఈ సందర్భంగా సన్‌రైజర్స్ కెప్టెన్ మార్‌క్రమ్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. ఉమ్రాన్ మాలిక్‌ను ఎందుకు ఆడించడం లేదు అంటూ ప్రశ్నించగా మార్‌క్రమ్(Aiden Markram) చెప్పిన సమాధానం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నిజాయతీగా చెప్పాలంటే అతడిని ఎందుకు ఆడించడం లేదో తనకు తెలియదన్నాడు. తెర వెనుక ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నాడు.
IPL 2023: రియల్ కింగ్ కోహ్లినే.. రానున్న ఐదేళ్ల కాలం విరాట్ దే.. పాక్ మాజీ బౌలర్
మార్‌క్రమ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారాయి. కెప్టెన్‌కే ఏం జరుగుతుందో తెలియదు అంటే ప్రాంఛైజీలో ఏదో సమస్య ఉందని కొందరు అంటున్నారు. ఈ విషయంపై టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) స్పందించాడు. ఎస్ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్‌తో ఉమ్రాన్ మాలిక్‌కు గొడవ జరిగి ఉండొచ్చునని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. తెర వెనుక అంటే తనకీ అర్ధం కాలేదన్నాడు.
మేనేజ్‌మెంట్‌తో గొడవ పడ్డాడేమో : సెహ్వాగ్
“మైదానం బయట నీ జీవితంలో నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. అది నీ లైఫ్ అని నేను నమ్ముతాను. అయితే.. ఒక్కసారి మైదానంలో దిగిన తరువాత మాత్రం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే కృషి చేయాలి. ఇందుకోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావ్ అన్నది కూడా ముఖ్యమే. తెర వెనుక అంటే నాకు అర్ధం కాలేదు. అతను(ఉమ్రాన్) మేనేజ్‌మెంట్‌తో గొడవ పడి ఉండొచ్చు లేదా వాదన చేయొచ్చు.” అని సెహ్వాగ్ అన్నాడు.
IPL 2023: ఉప్పల్‌లో కోహ్లి ఊచకోత.. క్లాసెన్ సెంచరీ వృధా.. హైదరాబాద్ పై బెంగళూరు ఘన విజయం
ఒకవేళ అదే జరిగితే మాత్రం అది తప్పు. నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వ సత్తాచాటకపోతే మళ్లీ అవకాశం ఇచ్చే వరకు ఓపికతో వెయిట్ చేయాలి. నీ ప్రదర్శనతో అందరి నోళ్లు మూయించాలి. అప్పట్లో డేవిడ్ వార్నర్ ఇలాగే చెప్పాడని అనుకుంటున్నా. అని సెహ్వాగ్ అన్నాడు. సన్‌రైజర్స్ తన చివరి మ్యాచ్ ఆదివారం ముంబైతో ఆడనుంది. మరి ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో చూడాలి.