IPL 2023: రియ‌ల్ కింగ్ కోహ్లినే.. రానున్న ఐదేళ్ల కాలం విరాట్ దే.. పాక్ మాజీ బౌల‌ర్‌

సెంచ‌రీ చేసిన కోహ్లిపై ప్ర‌స్తుతం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఇప్పుడు ఈ జాబితాలో పాకిస్థాన్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ అమీర్ కూడా చేరిపోయాడు. నిజంగా ఇది అద్భుత‌మైన ఇన్నింగ్స్‌.. రియ‌ల్ కింగ్ కోహ్లి ఒక్క‌డే అంటూ అమీర్ ట్వీట్ చేశాడు.

IPL 2023: రియ‌ల్ కింగ్ కోహ్లినే.. రానున్న ఐదేళ్ల కాలం విరాట్ దే.. పాక్ మాజీ బౌల‌ర్‌

Virat Kohli- Mohammad Amir

Mohammad Amir-Virat Kohli: రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(Royal Challengers Bangalore) త‌రుపున ఆడుతున్న ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి(Virat Kohli) ఐపీఎల్(IPL) 2023 సీజ‌న్‌లో దుమ్ములేపుతున్నాడు. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో శ‌త‌కంతో విధ్వంసం సృష్టించాడు. గురువారం ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌(Sunrisers Hyderabad)తో జ‌రిగిన మ్యాచ్‌లో నాలుగేళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో సెంచరీ కొట్టాడు.

విరాట్‌కు ఐపీఎల్‌లో ఇది ఆరో శ‌త‌కం కావ‌డం విశేషం. కోహ్లి శ‌త‌క్కొట్ట‌డంతో హైద‌రాబాద్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఆర్‌సీబీ అల‌వోక‌గా ఛేదించింది. ఈ విజ‌యంతో బెంగ‌ళూరు ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవంగా ఉన్నాయి. మ‌రో మ్యాచ్ మిగిలిన ఉన్న నేప‌థ్యంలో ఆ మ్యాచ్‌లోనూ ఇదే దూకుడు కొన‌సాగిస్తే ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాక‌పోవ‌చ్చు.

Virat Kohli: టాటూల‌కు భాగ‌స్వామ్యానికి లింక్ పెట్టిన కోహ్లి.. ఏంటి బాసూ ఇది..!

అద్భుత సెంచ‌రీ చేసిన కోహ్లిపై ప్ర‌స్తుతం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఇప్పుడు ఈ జాబితాలో పాకిస్థాన్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ అమీర్ కూడా చేరిపోయాడు. “నిజంగా ఇది అద్భుత‌మైన ఇన్నింగ్స్‌.. రియ‌ల్ కింగ్ కోహ్లి ఒక్క‌డే.. టేక్ ఎ బో” అంటూ అమీర్ ట్వీట్ చేశాడు.

ఓ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం క్రికెట్ ఆడే వారిలో త‌న‌కు విరాట్ కోహ్లి అంటే చాలా ఇష్టం అని అమీర్ అన్నాడు. ఈ త‌రంలో కోహ్లితో పోల్చ‌ద‌గ్గ మ‌రో క్రికెట‌ర్ లేడ‌ని, విరాట్ సాధించిన ఘ‌న‌త‌లు నిజంగా అద్భుతమ‌న్నాడు. వాటి గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అవుతుందని, ఖ‌చ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో సెంచ‌రీ చేసి త‌న జ‌ట్టును గెలిపించ‌డం అసాధ్యమ‌ని, అందుకే ఈ శ‌త‌కం కోహ్లికి చాలా ప్ర‌త్యేకమ‌ని చెప్పుకొచ్చాడు.

Virat Kohli: క్రిస్ గేల్ రికార్డును సమం చేసిన కోహ్లీ.. అత్యధిక సెంచరీలు చేసిన టాప్-5 బ్యాటర్లు వీరే..

ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆడిన కొన్ని షాట్లు బౌల‌ర్ల‌ను ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించాయ‌ని, పొట్టి ఫార్మాట్‌లో ఆరు శ‌త‌కాలు చేయ‌డం అంటే అసాధార‌ణ‌మైన విష‌యం అని అన్నాడు. స‌మ‌కాలిన క్రికెట్‌లో విరాట్ నిజ‌మైన రాజు అని, మ‌రో ఐదేళ్ల పాటు విరాట్ కాలం కొన‌సాగ‌నుంద‌ని జోస్యం చెప్పాడు. ఈ టైమ్‌లో మ‌రెన్నో రికార్డుల‌ను విరాట్ నెల‌కొల్పుతాడ‌న్నాడు. ఈ సారి అయినా ఆర్‌సీబీ టైటిల్ గెలివాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపాడు.